జాగ్రత్త భయ్యా : సిగరెట్లు తాగితే జుట్టు తెల్లబడుతుందట....

మామూలుగా ధూమపానం, మద్యపానం చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమని సినిమా థియేటర్లలో సినిమా మొదలయ్యే  ముందు ప్రకటనల ద్వారా అవగాహన కల్పిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అంతేకాక మన నిత్య జీవితంలో కూడా కొందరు డాక్టర్లు మద్యపానం, ధూమపానం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా ఊపిరి తిత్తులు దెబ్బతిని శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతుంటారు.

 Hair Is Getting White For Cigarette Smoking-TeluguStop.com

 అయితే తాజాగా కొందరు వైద్య నిపుణులు సిగరెట్లు త్రాగడం వల్ల వెంట్రుకలు నల్ల బడతాయని కూడా కనుగొన్నారు.

ఇందుకు గల కారణాలను వివరిస్తూ తరుచూ పొగ త్రాగడం వల్ల రక్తంలోని ఎర్ర రక్తకణాలు దెబ్బ తింటాయని దాంతో వెంట్రుకలు నల్లగా మరియు మృదువుగా ఉండడానికి కావలసినటువంటి విటమిన్లు అందక వెంట్రుకలు తెల్లగా మారుతాయని చెబుతున్నారు.

 Hair Is Getting White For Cigarette Smoking-జాగ్రత్త భయ్యా : సిగరెట్లు తాగితే జుట్టు తెల్లబడుతుందట….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేగాక ఎక్కువగా ఆందోళన చెందడం మరియు తీవ్ర తలనొప్పితో ఇబ్బంది పడడం వంటి కారణాల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోవడమేగాక తెల్లగా మారుతాయని మరికొందరు వైద్య నిపుణులు అంటున్నారు.అయితే ఈ ప్రోగ తాగడం వల్ల క్రమక్రమంగా మనుషుల్లో హ్యూమ్యూనిటీ పవర్ తగ్గడంతో పాటు వీర్య కణాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుందని  ఇటీవలే పలు అధ్యయనాల ద్వారా నిరూపించారు.

కాబట్టి ధూమ పానం చేసేటువంటి వ్యక్తులు కొంతమేర జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.అంతేగాక పలు శ్వాసకోస సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని కాబట్టి వీలైనంత త్వరగా  పొగ త్రాగడం మానేస్తే ఆరోగ్యానికి మంచిదని పొగ త్రాగే  వారికి సూచిస్తున్నారు.

#White Hair #Hair Following #SmokingEffect #HairIs

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు