ఈ నూనెలో ఇది కలిపి రాస్తే ఒత్తైన పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది  

ప్రతి మహిళ జుట్టు అందంగా,పొడవుగా ఉండాలని కోరుకుంటుంది.ఆలా కోరుకోవడంలో కూడా తప్పు లేదు.

ఎందుకంటే జుట్టు అనేది అందాన్ని ఇస్తుంది.అటువంటి జుట్టు అందంగా పొడవుగా ఒత్తుగా ఉండాలంటే ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

TeluguStop.com - ఈ నూనెలో ఇది కలిపి రాస్తే ఒత్తైన పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది-Telugu Health-Telugu Tollywood Photo Image

ఈ చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి.

కావలసిన పదార్ధాలు
కలబంద జెల్ ఒక స్పూన్
బాదం నూనె ఒక స్పూన్

కలబంద

కలబందలో ప్రోటీయోలైటిక్ ఎంజైములు,ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలకుండా బలంగా ఉండేలాచేస్తుంది.

అంతేకాక యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రు సమస్యలు రాకుండా చేస్తుంది.అంతేకాక జుట్టు బలంగా పెరగటానికి ప్రోటీన్స్ సహాయపడతాయి.కలబంద మొక్క నుండి తీసిన జెల్ ని వాడవచ్చు.లేదా మార్కెట్ లో లభించే జెల్ ని అయినా వాడవచ్చు.

బాదం నూనె

జుట్టు సమస్యల పరిష్కారానికి బాదం నూనె చాలా బాగా సహాయపడుతుంది.బాదం నూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి.అందువల్ల జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది.అలాగే జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది.

రెండు స్పూన్ల కలబంద జెల్ కి ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి.ఇలాంటి కలబంద,బాదం నూనెలను కలిపి జుట్టుకు వాడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి.ఒక అరగంట ఆలా వదిలేసి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటమే కాకుండా తెల్లజుట్టు కూడా నల్లగా మారుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు