హెయిర్‌ డై వికటించి మొహం ఇలా అయ్యింది... మీరు హెయిర్‌ డై వాడుతూ ఉంటే ఇదొకసారి జాగ్రత్తగా చదవండి  

దేవుడు ఇచ్చిన అందం కాకుండా, ఇంకా అందంగా కనిపించాలని జనాలు కోరుకుంటూ ఉంటారు. అందాన్ని మెరుగులు దిద్దుకునేందుకు ఎన్నో రకాల రసాయనాలను వాడుతూ ఉంటారు. మొహంపై రసాయనాలను వాడుతూ తాత్కాలిక అందంను తెచ్చుకుంటారు. కాని అవే ముందు ముందు పెద్ద శాపంగా మారుతుందనే విషయాన్ని గమనించరు. సినీ ఆర్టిస్టులు ఎక్కువగా మేకప్‌లు వేసుకుంటారు కనుక వారు ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడటంతో పాటు, పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైధ్యులు అంటున్నారు. కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్‌ లేట్‌గా రియాక్షన్‌ ఇస్తే, అప్పుడప్పుడు కొన్ని మాత్రం వెంటనే రియాక్షన్స్‌ ఇస్తాయి.

Hair Dye Colours Side Effects-Side Effects

Hair Dye Colours Side Effects

తాజాగా 19 ఏళ్ల ఒక ప్రెంచ్‌ యువతి తన జుట్టును సిల్కీగా మార్చుకునేందుకు, అందంగా ఉండేలా హెయిర్‌ డైని వాడినది. పీపీడీ హెయిర్‌ డైను వాడటం వల్ల ఈమె నుదురు చాలా పెరగడంతో పాటు మొహం అందవికారంగా తయారు అయ్యింది. ఆమె వాడిన హెయిర్‌ డై వికటించి ఇలా అయ్యిందని వైధ్యులు నిర్థారించారు. హెయిర్‌ డైలో ఉన్న రసాయనాలు అధికమోతాదులో అవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లుగా చెబుతున్నారు. అయితే ఆమె మాత్రం తాను డైను మోతాదుగా పెట్టుకున్నాను, కంపెనీ వారు సూచించిన విధంగానే హెయిర్‌ డై వాడాను అంటూ చెప్పుకొస్తుంది.

Hair Dye Colours Side Effects-Side Effects

హెయిర్‌ డై పెట్టుకుని, తెల్లవారిన తర్వాత చూస్తే తన మొహంను తానే గుర్తు పట్టలేనంతగా మార్పు వచ్చిందని, భయంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న ఆమె తిరిగి మామూలు రూపంను దక్కించుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని వైధ్యులు చెబుతున్నారు. భారీ ఎత్తున హెయిర్‌ డై వాడేవారు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచింది.

Hair Dye Colours Side Effects-Side Effects

ఇష్టం వచ్చినట్లుగా కాకుండా అప్పుడప్పుడు అది కూడా ఒక మోతాదులో మాత్రమే హెయిర్‌ డై వాడితే బెటర్‌ అంటూ వైధ్యులు సూచిస్తున్నారు.