WhatsApp Firefox యూజర్లు ఈ తప్పులు చేయకండి.. డేంజర్ లో పడతారు!

నేడు స్మార్ట్ ఫోన్స్ అనేవి తప్పనిసరిగా మారడంతో ఇంటర్నెట్‌ వినియోగం దారుణంగా పెరిగింది.ఈ క్రమంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ పేమెంట్స్‌ ట్రాన్సాక్షన్లు కూడా భారీగా పెరిగాయి.

 Hackers Targeting Whatsapp Firefox Users-TeluguStop.com

దీన్ని అలుసుగా చేసుకొని కేటుగాళ్లు డిజిటల్‌ డివైజెస్‌ లక్ష్యంగా సైబర్‌ దాడులు చేస్తున్నారు.ఫోన్లు, కంప్యూటర్లలో లోపాలను ఆసరాగా చేసుకొని హ్యాకర్లు దాడులు చేస్తున్నారు.

పాస్‌వర్డ్‌లు, ఇతర డేటాను దొంగిలించి బ్యాంక్‌ అకౌంట్స్‌లో నగదు మాయం చేస్తున్నారు.అయితే తాజాగా వాట్సాప్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ యూజర్లు హ్యాకర్లకు టార్గెట్‌ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది CERT-In (ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్.

)

ఇకపోతే హ్యాకింగ్, సైబర్ దాడుల ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్ పని చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌ స్పేస్‌లో ప్రమాదాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

సైబర్‌ దాడులకు గురికాకుడా ఉండేందుకు సలహాలు, సూచనలు అందిస్తోంది.తాజాగా వాట్సాప్ యాప్‌ వినియోగిస్తున్న యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సంస్థ హెచ్చరిస్తోంది.

Telugu Cert, Cyber Security, Firefox, Mozilla Firefox, Ups, Whatsapp-Latest News

విషయం ఏమంటే, వాట్సాప్‌లో మల్టిపుల్‌ వల్నరబిలిటీస్‌ ఉన్నాయని, హ్యాకర్స్‌కు టార్గెట్‌ మారడంలో సహాయపడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు యూజర్లు తమ వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని CERT-In పేర్కొంది.Mozilla Firefox బ్రౌజర్‌లో కూడా మల్టిపుల్‌ వల్నరబిలిటీస్‌ ఉన్నాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్ తెలిపింది.ఈ లోపాలను వినియోగించుకుని హ్యాక్‌ చేయడానికి వీలుగా రూపొందించిన వెబ్‌సైట్‌ను హ్యాకర్స్‌ ఓపెన్‌ చేసే అవకాశం ఉందని నోడల్ ఏజెన్సీ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube