మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి...!

ప్రపంచం నలుమూలల కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి హ్యాకర్స్ కూడా ప్రజలపై సైబర్ దాడులు ఎక్కువ చేసారని చెప్పవచ్చు.అయితే ఎవరైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఎలా పనిచేస్తుందో, ప్రస్తుతం వారి ఫోన్ ఎలా పని చేస్తుందో గమనిస్తే… వాటి ద్వారా కూడా వారి ఫోన్ హ్యాక్ అయిందో…? లేదో.? కూడా చెప్పవచ్చు.ఎవరిదైనా స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఆ మొబైల్ యొక్క పర్ఫామెన్స్ లో చాలా తేడాలు కనబడతాయి.

 Heres How To Find Out If Your Smartphone Has Been Hacked   Hackers, Bank Account-TeluguStop.com

అయితే యూజర్లు ఆ తేడాలను గమనించకపోవడంతో వారి ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం కూడా కనిపెట్టలేరు.కేవలం మొబైల్ లో ఏదో లోపం వలన అని అనుకోని సింపుల్ గా వదిలేస్తారు.

కాకపోతే హ్యాకింగ్ జరిగిన తర్వాత ఆ యూజర్ చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.ఇలాంటి సమస్యలు ఎక్కువగా థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం లేదా ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ లో ఏదైనా వైరస్ లాంటిది ఉండడం ద్వారా మీ ఫోన్ హ్యాక్ కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

అంతేకాదు కొంతమంది హాకర్స్ మీ స్మార్ట్ ఫోన్ కు ఏదైనా ఎస్ఎంఎస్ పంపించి కూడా హ్యాక్ చేయవచ్చు.

ఇలా ఫోన్ హ్యాక్ గురికావడంతో ఆ ఫోన్ లో ఉన్న బ్యాంకింగ్ సమాచారాన్ని, ఏదైనా పర్సనల్ సంబంధించి సమాచారం ఆ హాకర్ల చేతికి వెళ్ళినట్టే.

ఇలా మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఎలా కనిపెట్టవచ్చు అంటే… ముందుగా మీరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న సమయంలో ఎక్కువ యాడ్స్ కనపడుతున్నాయి అంటే… మీ ఫోన్ లో ఏదో మాల్వేర్ ఉండి ఉండవచ్చు.లేదా ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక మరో విషయం ఏమిటంటే… మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ కూడా తరచూ ఖాళీ అయిపోతుంది.ఇదివరకు ఒకరోజు పూర్తిగా వచ్చే బ్యాటరీ ఆ తర్వాత కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

దీనికి కారణం మీరు ఇన్స్టాల్ చేసుకున్న మాల్వేర్.ఇది బ్యాక్ గ్రౌండ్ లో ప్రతి సెకండ్ పని చేస్తూనే ఉంటుంది.వీటితో పాటు మరికొన్ని విషయాలు చూస్తే… మీ మొబైల్ డేటా ఎక్కువగా ఖర్చు అవుతున్న, లేకపోతే విదేశీ నెంబర్ల నుండి మీ ఫోన్ కి తరుచుగా మిస్డ్ కాల్స్ వస్తున్న, మీరు వాడే యాప్స్ సడన్ గా క్లోజ్ అవుతున్న మీ ఫోన్ హ్యాకింగ్ కి గురైనట్లు భావించవచ్చు.ఇలాంటివి గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని రాబోయే ఆపదల నుండి బయటపడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube