హెచ్-4 వీసాదారులకు శుభవార్త: వర్క్ పర్మిట్లను బ్లాక్‌ చేయొద్దని‌ కోర్టును కోరిన ట్రంప్ సర్కార్

అమెరికాలోని హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే వర్క్ పర్మిట్లను బ్లాక్ చేయవద్దని వాషింగ్టన్‌లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌ను డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం కోరింది.వారు ఉద్యోగాలు పొందడం వల్ల స్థానిక అమెరికన్ల ఉద్యోగావకాశాలు అంతగా ప్రభావితం కావడం లేదని కోర్టుకు తెలిపింది.

 America, Donald Trump, Obama, Uscis, Federal District Court, H1b, H4, Visa, Gree-TeluguStop.com

హెచ్ 4 వీసాదారుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతోందంటూ ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’’ వాదిస్తున్న వాదన సరికాదని డిస్ట్రిక్ట్ కోర్టుకు ట్రంప్ ప్రభుత్వం మే 5న వివరించింది.దానికి సంబంధించి సేవ్ జాబ్స్ చూపిన ఆధారాలు సరికాదని వాదించింది.ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటి నివేదికను సమర్పించింది.

హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి, 21 ఏళ్లు పైబడిన పిల్లలకు అమెరికా ప్రభుత్వం హెచ్4 వీసా జారీ చేస్తుంది.హెచ్ 4 వీసాదారుల్లో కొన్ని కేటగిరీల వారు ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా కల్పించింది.కాగా 2017 డిసెంబర్ నాటికి 1,26,853 హెచ్4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ దరఖాస్తులను యూఎస్‌సీఐఎస్ ఆమోదించింది.

ఒబామా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమెరికన్ టెక్నాలజీ వర్కర్ల తరపున సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ కోర్టులో సవాలు చేసింది.హెచ్4 వీసాదారులు యూఎస్‌లో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటును తొలగించే విషయమై ఆలోచిస్తున్నామని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.హెచ్4 వీసాలు ఉన్న వాళ్లకు అమెరికాలో పని చేసేందుకు అనుమతి ఉంది.అగ్రరాజ్యంలో శాశ్వత నివాసాన్ని కల్పించే ‘‘గ్రీన్ కార్డు’’ కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు మాత్రమే ఇలా పనిచేసేందుకు ఛాన్స్ ఉంది.ఇలా పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది మన భారతీయులే ఉన్నారు.

తర్వాతి స్థానంలో చైనీయులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube