హెచ్ -4 వీసాకు స్వస్తి..ఆందోళనలో భారతీయులు..       2018-06-16   02:12:01  IST  Bhanu C

గడిచిన కొన్నేళ్లుగా అగ్రరాజ్యం అమెరికా వీసా విధానంలో ఎన్నో కీలక మార్పులు చేసుకుంటూ వచ్చింది.. భారతీయులే టార్గెట్ గా సరికొత్త నిభందనలు తెరపైకి తెచ్చి భారతీయులని వెళ్ళగొట్టడమే టార్గెట్ గా పెట్టుకుంది..అయితే గత కొంతకాలంగా హెచ్ -4 వీసా లని రద్దు చేస్తున్నాము అని చెప్తూ వస్తున్నా ట్రంప్ ప్రభుత్వం తమ నిర్ణయం ఇక త్వరలోనే అమలులోకి రానుందని హెచ్ -4 వీసాని త్వరలో రద్దు చేస్తామని తేల్చి చెప్పేసింది.

2015లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు చేసిన ఈ రూల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లుగా మరో మారు ప్రపంచానికి పునరుద్ఖాటించింది…విదేశీయులకు ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ ఇచ్చే కేటగిరీ నుంచి హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములను తొలగిస్తున్నాం’’ అని అమెరికా ఆంతరంగిక భద్రత విభాగం ఫెడరల్‌ రిజిస్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ఆ నివేదికలో పేర్కొంది.

అయితే విడుదల కాబడిన నోటిఫికేషన్ పై అభిప్రాయ సేకరణ జరుగుతుందని..నిబంధనల రూపకల్పన ప్రక్రియలో ఇది ఒక భాగమని, ఇది తుది నిర్ణయం కాదని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం అంటున్నప్పటికీ ఈ నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టమవుతోంది.ఆ..అయితే త్వరలో అమలు కానున్న ఈ వీసా రద్దు గనుకా అమలులోకి వస్తే దాదాపు లక్షమంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతారు.

,