హెచ్ -4 వీసాకు స్వస్తి..ఆందోళనలో భారతీయులు..

గడిచిన కొన్నేళ్లుగా అగ్రరాజ్యం అమెరికా వీసా విధానంలో ఎన్నో కీలక మార్పులు చేసుకుంటూ వచ్చింది.భారతీయులే టార్గెట్ గా సరికొత్త నిభందనలు తెరపైకి తెచ్చి భారతీయులని వెళ్ళగొట్టడమే టార్గెట్ గా పెట్టుకుంది.

 H4 Visa Work Permits To Be Revoked-TeluguStop.com

అయితే గత కొంతకాలంగా హెచ్ -4 వీసా లని రద్దు చేస్తున్నాము అని చెప్తూ వస్తున్నా ట్రంప్ ప్రభుత్వం తమ నిర్ణయం ఇక త్వరలోనే అమలులోకి రానుందని హెచ్ -4 వీసాని త్వరలో రద్దు చేస్తామని తేల్చి చెప్పేసింది.

2015లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు చేసిన ఈ రూల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లుగా మరో మారు ప్రపంచానికి పునరుద్ఖాటించింది…విదేశీయులకు ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ ఇచ్చే కేటగిరీ నుంచి హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములను తొలగిస్తున్నాం’’ అని అమెరికా ఆంతరంగిక భద్రత విభాగం ఫెడరల్‌ రిజిస్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ఆ నివేదికలో పేర్కొంది.

అయితే విడుదల కాబడిన నోటిఫికేషన్ పై అభిప్రాయ సేకరణ జరుగుతుందని.నిబంధనల రూపకల్పన ప్రక్రియలో ఇది ఒక భాగమని, ఇది తుది నిర్ణయం కాదని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం అంటున్నప్పటికీ ఈ నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టమవుతోంది.

ఆ.అయితే త్వరలో అమలు కానున్న ఈ వీసా రద్దు గనుకా అమలులోకి వస్తే దాదాపు లక్షమంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube