హెచ్‌1బీ లాటరీ కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్: యూఎస్‌సీఐఎస్

త్వరలో జరగనున్న హెచ్1బీ వీసా లాటరీ కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్ ) ప్రకటించింది.అలాగే 2021 ఆర్ధిక సంవత్సరానికి హెచ్1 క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేయాలనుకునే కంపెనీ/యజమానులు ముందుగా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.

 H1belectronic Registration For Fy2021-TeluguStop.com

అలాగే ప్రతి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌కు 10 అమెరికన్ డాలర్లను రుసుముగా చెల్లించాలని యూఎస్‌సీఐసీ తెలిపింది.

Telugu Fy, Electronic, Telugu Nri Ups-

హెచ్1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఏప్రిల్ 2019లో అమల్లోకి వచ్చింది.వ్రాతపని, డేటా మార్పిడిని తగ్గించడం ద్వారా వీసా ప్రాసెసింగ్‌ను క్రమబద్దీకరిస్తుందని యూఎస్‌సీఐసీ తెలిపింది.హెచ్1బీ క్యాప్ సబ్జెక్ట్ దరఖాస్తుల కోసం కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన ధృవీకరణ కోసం యజమానులు/కంపెనీలు వేచిచూస్తున్నారు.వార్షిక హెచ్1బీ క్యాప్‌ను అనుసరించి యజమానులు ప్రతి ఏడాది ఏప్రిల్‌ ప్రారంభంలో పిటిషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.

హెచ్1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ విధానానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు:

* సంస్థ, దరఖాస్తు దారుడి ప్రాథమిక సమాచారాన్ని యాజమాన్యం పూర్తి చేయాలి

* మార్చి 1, 2020 నుంచి మార్చి 20, 2020 వరకు యూఎస్‌సీఐఎస్ రిజిస్ట్రేషన్‌ అందుబాటులో ఉంటుంది.

* ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌లలో అవసరమైతే హెచ్1బీ లాటరీ ని నిర్వహిస్తారు

* రిజిస్ట్రేషన్లలో ఎంపిక చేయబడిన యజమానులు నిర్ణీత కాలపరిమితి లోగా హెచ్1బీ క్యాప్ సబ్జెక్ట్‌ పిటిషన్లను దాఖలు చేయడానికి అర్హులు

* రిజిస్ట్రేషన్‌ ప్రారంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో కీలక తేదీలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలన్న దానిపై దశల వారీ సూచనలను యూఎస్‌సీఐఎస్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.

* రిజిస్ట్రేషన్లను అనుమతించడంతో పాటు డిమాండ్ మేరకు రిజిస్ట్రేషన్ కాలపరిమితిని పొడిగించే అంశాన్ని యూఎస్‌సీఐఎస్ పరిశీలించవచ్చు.

* హెచ్1బీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అమలుతో పాటు అదనపు వివరాలను హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసును ప్రచురిస్తుంది.

యజమానులు వారి నియామక అవసరాలతో పాటు నిపుణులైన అభ్యర్ధులను పరిగణనలోనికి తీసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని వీలైనంత త్వరగా సేకరించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube