అమెరికాలో లాటరీ..భారతీయులకి బంపర్ ఆఫర్..!!!

అమెరికాలో లాటరీ ఏంటి అనుకుంటున్నారా, లాటరీ అంటే డబ్బులతో కూడిన లాటరీ కాదు వీసాల కోసం వేసే లాటరీ.అర్థం కాలేదా సరే అసలు విషయం ఏమిటంటే.

 H1b Visa Bumper Offer To Indians, Donald Trump H1b Visa Rules, H1b Visa, Donald-TeluguStop.com

అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వారు హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగాన్ని చేపడుతారు.అయితే హెచ్-1బీ వీసా దారులని ఎంపిక చేయడం కోసం అమెరికా ప్రభుత్వం లాటరీ విధానం ద్వారా హెచ్- 1 బీ వీసా దారులని ఎంపిక చేస్తుంది.

ప్రతీ సారి లాటరీ ద్వారా 85 వేల మందిని ఎంపిక చేస్తారు.ఈ సారి ఈ విధానంలో సరిపడనంత మంది ఎంపిక కాలేదు.

ఎందుకంటే.

కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోవడంతో ట్రంప్ వీసాలపై ఆంక్షలు విధించారు.

ఈ క్రమంగా ఉద్యోగాలలో కోతలు విధించడంతో ఎన్నో కంపెనీలు ఉద్యోగాల కల్పన విషంలో సంఖ్యని తగ్గించుకున్నాయి.దాంతో హెచ్ -1బీ కోసం తీసిన లాటరీలో తక్కువ మందిని ఎంపిక చేయాల్సి వచ్చింది.

అయితే తాజాగా ట్రంప్ విదేశీ నిపుణులు అమెరికా వచ్చే విధానంలో మార్పులు చేస్తూ నిభందనలు సడలించడంతో ఉద్యోగాలను కంపెనీలు యధావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి.గడించిన లాటరీ విధానంలో చాలినంత మంది నిపుణులు ఎంపిక కాకపోవడంతో రెండవ సారి లాటరీ తీయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇదిలాఉంటే

Telugu America, Donald Trump, Donaldtrump, Hb Visa, Hbvisa, Lottery-

అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ హెచ్- 1 బీ వీసాల ఎంపికకై రెండు సార్లు లాటరీ తీసిన సంఘటనలు లేవని ఇదే మొట్టమొదటి సారని అంటున్నారు నిపుణులు.కరోనా కారణంగా వీసాలు ఉండి భారత్ వెళ్ళిన నిపుణులు యాదావిదిగా రావచ్చని కొత్త నియామకలకి లాటరీ నిర్వహించారని అధికారులు తెలిపారు.అయితే ఈ లాటరీలో ఎంతమందిని ఎంపిక చేస్తారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.అంతేకాదు రెండవ సారి లాటరీ తీయడం ద్వారా హెచ్-1 బీ వీసా దారులలలో ఉద్యోగాలు అత్యధికంగా భారతీయులకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube