హెచ్‌–1బీ వీసా జారీలో జాప్యం..బిడెన్ వెనకడుగు..??

అమెరికాలో పనిచేయలనుకునే వలస వాసులకు ఇచ్చే వీసానే హెచ్-1బి వీసా అంటారు.ఈ వీసా ద్వారా అమెరికాలో స్థిరపడిన వలస వాసులలో భారతీయులు అత్యధికంగా ఉండటం గమనార్హం.

 Joe Biden Not Yet Decided H1b Visa ,h1b Visa, Donald Trump, Joe Biden, H1b Visa-TeluguStop.com

అయితే హెచ్-1బి కారణంగా అమెరికన్స్ కు అవకాశాలు తగ్గిపోతున్నాయనే కారణంగా ట్రంప్ ఎన్నికల ముందు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.ఈ కారణంగా అమెరికాలో స్థిరపడాలనుకునే ఎంతో మంది డ్రీమర్స్ ఆశలు మధ్యలోనే ఆగిపోయాయి.

కేవలం భారతీయుల కారణంగానే అమెరికన్స్ కు స్థానికంగా ఉద్యోగాలు అందటం లేదనే కారణంగా వీసాలపై విధించిన నిషేదాన్ని అమెరికాలోని పలు కంపెనీలు కూడా వ్యతిరేకించాయి.ట్రంప్ విధానాలు సరికావంటూ కోర్టులను ఆశ్రయించాయి.

ఈ క్రమంలోనే ఎన్నికలు రావడం నూతన అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన బిడెన్ అప్పట్లో వీసాలపై ఉన్న ఆంక్షలు ఎత్తేస్తామని హామీ ఇవ్వడంతో భారతీయ ఎన్నారైలు మాత్రమే కాకుండా వివిధ దేశాల వలస వాసులు సైతం గంపగుత్తంగా ఓట్లు వేసేశారు.కానీ

Telugu Americans, Donald Trump, Hb Visa, Hb Visa Ban, Indian Nris, Joe Biden, Jo

మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం ఈ నెల 31 న ముగియనున్న తరుణంలో నూతన అధ్యక్షుడు బిడెన్ ఇప్పటి వరకూ నిషేధం ఎత్తివేయడంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.31 లోగా నిషేధం ఎత్తేస్తారా లేదంటే నిషేధం పొడిగిస్తారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సమాధానం చెప్పలేక పోయింది.అంతేకాదు కరోనా వలన అమెరికాలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, ప్రస్తుతం తాము అమెరికన్స్ కు ఉద్యోగాలు కల్పించే ఆలోచనలో ఉన్నాము, ఇప్పుడు ఇదే మాకు ప్రధాన అంశమని తెలుపడంతో వీసా నిషేధాన్ని బిడెన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఇప్పటి వరకూ బిడెన్ నుంచీ ఎలాంటి హామీ వెలువడలేదని అంటున్నారు నిపుణులు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube