మరో సంస్కరణ దిశగా ట్రంప్ : విదేశీ శాస్త్రవేత్తలకు ఇక డాలర్ల పంటే.. !!!

అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా సంస్కరణలు చేస్తూ వచ్చారు.ఎంత మంది ఎన్నిరకాల విమర్శలు చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు.

 H1b Visa, Donald Trump,america,donald Trump Minimum Wage For H-1b Visa Holders C-TeluguStop.com

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానంలో ఆయన ఎన్నో మార్పులు చేపట్టారు.తాజాగా విదేశీ శాస్త్రవేత్తలకు కాసుల పంట పండించే నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.

హెచ్1 బీ స్టేటస్‌లో ఉన్న విదేశీ శాస్త్రవేత్తలకు ఆయా కంపెనీలు చెల్లిస్తున్న కనీస వేతనాన్ని పెంచాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు.దీని ప్రకారం ఏడాదికి 1.50 లక్షల డాలర్లుగా ఉన్న కనీస వేతనాన్ని 2.50 లక్షల డాలర్లకు పెంచాలి.అంటే ఎక్కువ వేతనాలు పొందని హెచ్ 1 బీ వీసా హోల్డర్ల ఎంట్రీని మినిమమ్ స్థాయిలో నిరోధిస్తూనే ఇందుకు శ్రీకారం చుట్టాలని ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.వీరి కనీస వేతనాలను లెవల్-4 స్థాయి వేతనాలుగా పరిగణించవచ్చు.

ఫైనాన్షియల్ మేనేజర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు వీరి కంటే ముందున్నారు .

Telugu America, Donald Trump, Donaldtrump, Hb Visa-

అయితే ట్రంప్ సర్కార్ ప్రతిపాదనలో పలు సమస్యలను విశ్లేషకులు గుర్తించారు.ప్రస్తుత హెచ్ 1 బీ వీసా హోల్డర్లలో సుమారు 5 శాతం మాత్రమే నాలుగో స్థాయి వేతనాలు పొందుతున్నారని వైట్ హౌస్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ గతంలోనే పేర్కొన్నారు.కాగా కొద్దిరోజుల క్రితం అమెరికాలో చదివిన విదేశీయులకే హెచ్ 1 బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలను హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాదారులతో భర్తీ చేయడాన్ని నిషేధించాలని కూడా సదరు బిల్లులో ప్రతిపాదించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube