“హెచ్‌-1బీ” వీసా మోసాలు..భారీగా ఫిర్యాదులు

అసలే హెచ్‌-1బీ వీసా జారీ విషయంలో అమెరికా ప్రభుత్వం పెట్టిన ఆంక్షలకి ఎన్నారై లు సతమతమవుతుంటే.ఇప్పుడు హెచ్‌-1బీ జారీలో జరుగుతున్న మోసాలు అక్రమాలు ఎన్నారైలకి పెద్ద చిక్కుని తెచ్చి పెడుతున్నాయి హెచ్‌-1బీ వీసాలలో భారీగా మోసాలు, దుర్వినియోగం జరిగనట్టు ఫిర్యాదులు వచ్చాయని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.హెచ్‌-1బీ, హెచ్‌-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఉద్దేశించిన తమ ప్రత్యేక ఈ మెయిల్‌, హెల్స్‌లైన్‌కు 5వేలకు పైగా ఫిర్యాదులు అందాయని ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు.

 H1b Visa Frauds-TeluguStop.com

క్రిందటి ఏడాది కి సంభందించిన అక్రమాలు ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు అయితే ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు.అంతేకాదు ఫిర్యాదులు ఏ ఏ దేశాల నుంచీ వచ్చాయి అనే విషయాన్ని కూడా అధికార్లు ప్రకటించలేదు.ఇదిలాఉంటే వీసాల జారీ విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కటినమైన నిర్ణయం నిభందనలు మనకి తెలిసినవే.

అమెరికాలో ఉన్న తమ పౌరులకి ఉద్యోగాలు అందాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చినా ట్రంప్ వెనకడుగు వేయలేదు.

అయితే ఇలాంటి నేపధ్యంలో వీసా జారీ ప్రక్రియలో అక్రమాలు, మోసాలను జరగడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉలిక్కిపడ్డారు వెంటనే చర్యలు చేపట్టారు…ముఖ్యంగా హెచ్‌-1బీ, హెచ్‌-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఈ మెయిల్‌ హెల్ప్ లైన్ ఏర్పారు చేశారు ([email protected]/[email protected])

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube