వారికే హెచ్-1 వీసా...తేల్చేసిన అమెరికా..

హెచ్ -1 బీ వీసా విషయంలో అమెరికా మరింత ఖటిన వైఖరిని అవలంభిస్తోంది.ఈ ఏడాది హెచ్‌-1బీ వీసాలకు వచ్చిన దరఖాస్తు అభ్యర్ధనలలో కేవలం అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఈ వీసాలు జారీ చేస్తామని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ప్రతినిధులు తేల్చి చెప్పారు.

 H1b Visa For Those People Studies In America Only-TeluguStop.com

గతంలోనే ట్రంప్ ఈ విధంగా ప్రకటన చేసిన విషయం విదితమే అయితే ఇప్పుడు వచ్చిన ధరఖాస్తుల్లో కేవలం ప్రతిభావంతులని మాత్రమే ఎంపిక చేస్తామని ఏకంగా అధికారులు సైతం ధ్రువీకరించేశారు.

తమ స్థానికులక ముందు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టెన్‌ నీల్సన్‌ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం హెచ్‌-1బీ వీసా దరఖాస్తు దారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.ఈ క్రమంలో కేవలం ప్రతిభావంతులని మాత్రమే తీసుకుంటే కంపెనీలకి సైతం మేలు ఉంటుందని అన్నారు.

అయితే ఈ విధంగా ప్రక్రియ జరిగితేనే పనిలో నాణ్యతతో పాటు అమెరికా ఆర్ధిక అభివృద్ధి కి సైతం ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.అంతేకాదు అమెరికా పౌరులకు సైతం ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube