హెచ్ 1 –బీ వారికే..!!!   H1b Visa For Only Who Studies In America Only     2018-12-02   17:18:59  IST  Surya

ట్రంప్ గత కొంతకాలంగా హెచ్ -1 బీ వీసాపై ఎన్నో రకాల ఆంక్షలు పెడుతూనే ఉన్నాడు..అమెరికాలో నివసించే విదేశీయులే టార్గెట్ గా తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మంది భారతీయ ఎన్నారైలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.. ఇదిలాఉంటే హెచ్ -1 బీ పై తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే.

అమెరికాలో ఉన్నత విద్యని చదువుకునే వారికి వారిలో అత్యంత ప్రతిభావంతులగా ఉంటూ ఎక్కువ జీతం పొందుతున్న వారికి మాత్రమే హెచ్‌1- బీ వర్క్ వీసా ఇచ్చేలా వ్యుహాలని రచిస్తున్నారు.

అయితే అందుకోసం ముందుగానే కంపెనీలు యుఎస్‌సిఐఎస్‌లో ఎలక్ట్రానిక్‌ విధానంలో నమోదుచేసుకోవాలి. అంతేకాదు అమెరికాలో చదువుకున్నవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని..మరేఇతర దేశాల్లో చదువుకుని ఉద్యోగం కోసం వచ్చిన వారికి వీసా పరిమితి తగ్గించి అమెరికాలో చదివిన వారికి వీసా పరిమితి పెంచాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

H1b Visa For Only Who Studies In America Only-H1b NRI Telugu News Updates

ఇదిలాఉంటే స్వదేసీయులు కాకుండా విదేశీయులు అమెరికాలో ఉన్నత విద్యను చదువుకుంటే వారికి 20వేల వీసాలు ఇచ్చేట్టుగా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది…అయితే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని హెచ్‌-1 బీ వీసా కోసం దరఖాస్తుచేసుకునే వారికి ధీర్గకాలిక లాభం ఉండేలా ఆలోచనలు చేస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.