అమెరికాలో మరో కీలక బిల్లుకు సెనేట్ పచ్చ జెండా దాదాపు ఊపినట్టేనని , ఈ బిల్లుకు ఆమోద ముద్ర గనుకా పడితే ఎన్నారైల జేబులకు చిల్లులుపడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.ఇంతకీ ఈ బిల్లులో ఏముంది, ఎలాంటి ప్రభావం ప్రవాసులపై పడనుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
“బడ్జెట్ రీకన్సిలియేషన్” బిల్లు ప్రస్తుతం ప్రవాసులను కలవర పెడుతున్న ఈ తాజా బిల్లు సెనేట్ ముందుకు వెళ్ళింది.ఇక సెనేట్ ఆమోదం పొందటం మాత్రమే మిగిలి ఉంది.
ఈ బిల్లుకు గనుక అక్కడ ఆమోదం లభిస్తే వీసా పొందేందుకు, వీసా రెన్యువల్ సమయంలో ఎప్పటిలా అయ్యే ఖర్చులకంటే కూడా మరింత ఆర్ధిక భారం కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.హెచ్-1 బి వీసా పిటిషన్ పై 500 డాలర్ల అదనపు చార్జీలు విధించే అవకాసం ఉందట.అంతేకాదు అమెరికా వెళ్లేందుకు ఉన్న వీసాలు అన్నిటిపై ఇప్పుడు ఉన్న చార్జీలకంటే కూడా అదనపు చార్జీలు విధిస్తారట.ఉద్యోగుల కోసం సంస్థలు వీసాలను స్పాన్సర్ చేస్తాయి అలాంటి వీసాలకు 800 డాలర్లు, అలాగే స్టూడెంట్ వీసాలకు 250 డాలర్లు అదనం గా తీసుకోవాలని ఈ బిల్లు సూచిస్తోందట.

ఇదే కాదు అమెరికాలో వీసాతో ఉంటున్న వారి భాగస్వాములు అమెరికాలో పనిచేసేందుకు అనుమతులు కోరితే వాటిపై కూడా అదనంగా 500 డాలర్లు చెల్లించాలి.అంతేనా విధ్యార్హ్డులు ఆప్షనల్ పెట్టుకున్నా, వీసా స్టేటస్ లో మార్పులు చేయాలనుకున్నా ఈ తరహా చార్జీలు ఉంటాయట.ఇక ఈ బాదుడు కేవలం ఎన్నారైలకు మాత్రమే కాదు ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు కూడా వర్తిస్తుందట.హెచ్-1బి వీసాపై సంస్థలు వేలాది మందిని నియమించుకుంటాయి అలాంటి సంస్థలు ప్రతీ దరఖాస్తుదారుడుకు అదనంగా 4000 వేల డాలర్లు చెల్లించుకోవాలట, అలాగే ప్రాసెసింగ్ ఫీజు అంటూ మరో 2500 డాలర్లు కూడా అదనంగా చేలించుకోవాలట.దాంతో ఈ బిల్లు సెనేట్ లో ఎక్కడ ఆమోదం పొందుతుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రవాసులు.