'హెచ్‌1బీ సర్టిఫికేషన్లు'..టాప్ 10 లో భారతీయ కంపెనీ  

H1b Certifications Of Top 10 Indian Company-

అమెరికా కార్మిక శాఖ గణాంకాలలో ఈ ఏడాది హెచ్‌1బీ వీసాల కోసం అధిక సంఖ్యలో ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్లు పొందిన టాప్ 10 కంపెనీలలో భారత్ కి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌) నిలిచింది.సెప్టెంబరు 30తో ముగిసిన 2018 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ 20,755 హెచ్‌1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్‌ లేబర్‌ సర్టిఫికేషన్లు చేజిక్కించుకుంది…అయితే టాప్ లిస్టు లో అగ్రస్థానంలో ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై). హెచ్‌1బీ లేబర్‌ సర్టిఫికేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది..

'హెచ్‌1బీ సర్టిఫికేషన్లు'..టాప్ 10 లో భారతీయ కంపెనీ-H1B Certifications Of Top 10 Indian Company

అయితే తమ దేశంలో ఉండే కంపెనీలు సైన్స్‌, టెక్నాలజీతోపాటు కీలక రంగాల్లో ఉన్నత విద్యని అభ్యసించే విదేశీ నిపుణులను చేరుచుకునేందుకు వీలుగా అమెరికా ఈ వీసా పథకాన్ని ప్రవేశపెట్టింది. సాధారణంగా భారత ఐటీ నిపుణులు హెచ్‌1బీ వీసాలపైనే ఉద్యోగం కోసం అమెరికా వెళ్తుంటారు. హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందే అమెరికా కార్మిక శాఖకు కంపెనీ యజమాన్యం లేబర్‌ కండీషన్‌ అప్లికేషన్‌ (ఎల్‌సీఏ) సమర్పిస్తుంది.

కార్మిక శాఖ లేబర్‌ సర్టిఫికేషన్‌ జారీ చేశాకే కంపెనీలు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ కు హెచ్‌1బీ పిటిషన్లను సమర్పిస్తాయి. యూఎ్‌ససీఐఎస్‌ ప్రకారం.

అక్టోబరు 5 నాటికి అమెరికాలో 4,19,637 మంది విదేశీ నిపుణులు హెచ్‌1బీ వీసాలపై పనిచేస్తున్నారు. అందులో నాలుగింట మూడో వంతు మంది భారతీయ నిపుణులే.ఉండటం గమనార్హం.