హిట్ సీక్వెల్ లో అడవి శేష్.... అఫీషయల్ అనౌన్స్ మెంట్...

గత ఏడాది టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ (ది ఫస్ట్ కేస్) చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ హీరో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించగా నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.

 H.i.t Movie Sequel Announced By Adivi Sesh, Adivi Sesh, Tollywood Hero, H.i.t Mo-TeluguStop.com

కాగా ఈ చిత్రం విడుదల చేసిన కొద్దిరోజులకే కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేయడంతో అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.అయినప్పటికీ దర్శక నిర్మాతలపై ఈ చిత్రం కాసుల పంట పండించింది.

దీంతో ఈ చిత్రం సీక్వెల్ ని తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా తాజాగా హిట్ -2 (ది సెకండ్ కేస్) చిత్రంలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ప్రేక్షకులతో పంచుకున్నాడు.

తాను హిట్-2 చిత్రంలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపాడు.అంతేకాక ప్రస్తుతం తాను “మేజర్” చిత్ర షూటింగ్ లో ఉన్నానని ఈ చిత్ర షూటింగ్ పనులు పూర్తవ్వగానే హిట్ – 2 (ది సెకండ్ కేస్) చిత్ర షూటింగ్ లో పాల్గొంటానని తెలిపాడు.

అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశాడు.దీంతో కొందరు సినీ సెలబ్రిటీలు అడవి శేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పంజా చిత్రంతో నటుడిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పరిచయమైన అడవి శేష్ కేవలం హీరో పాత్రలను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా కనిపిస్తూ బాగానే అలరిస్తున్నాడు.ఈ మధ్య కాలంలో అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు, గూడచారి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి.

దీంతో మేజర్ చిత్రం తో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసేందుకు అడవి శేష్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.ఇటీవలే మేజర్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల కావడంతో మంచి స్పందన లభించింది.

కాగా ఈ చిత్రాన్ని జూలై 2వ తారీఖు న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube