హెచ్1బీ వీసా తిరస్కరణ: 98 శాతం కేసుల్లో నో అప్పీల్, పట్టించుకోని కంపెనీలు

అమెరికాలో హెచ్1బీ వీసా తిరస్కరణకు గురైనప్పుడు వాటిలో అత్యథిక శాతం అప్పీల్ చేయబడటంలేదని ఇమ్మిగ్రేషన్ విధానాలపై అధ్యయనం చేస్తున్న థింక్ టాంక్ సంస్థ తెలిపింది.ఇందులో ప్రైజ్డ్ వీసా తిరస్కరణ రేటు 2015లో 6 శాతంగా ఉండగా… 2019 ఆర్ధిక సంవత్సరం నాటికి 24 శాతానికి చేరింది.హెచ్1బీ వీసా తిరస్కరణకు గురైన 98.4 శాతం కేసులలో కంపెనీ యాజమాన్యాలు అప్పీల్ చేయకూడదని నిర్ణయించుకున్నాయని వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్‌ స్టడీస్‌ రీసెర్చర్ డేవిడ్ నార్త్ వెల్లడించారు.

 H 1b Visa Rejections Unchallenged-TeluguStop.com

2019 ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో 69,543 హెచ్1బీ వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.వీటిలో కేవలం 1,395 దరఖాస్తులు మాత్రమే అప్పీల్‌కు వెళ్లాయని హెంలాండ్ సెక్యూరిటీ గణాంకాలు చెబుతున్నాయి.

వీసా నిబంధనలు ఏమంత కఠినంగా లేవని.కానీ దరఖాస్తులు అత్యంత లోపభూయిష్టంగా ఉండటం వల్లే తిరస్కరణకు గురవుతున్నాయని నార్త్ తెలిపారు.

యాజమాన్యాలు కాస్త శ్రమించి అప్పీల్ చేస్తే ప్రయోజనం వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Telugu Visa, Telugu Nri Ups-

ఇదే సమయంలో ఇంట్రా కంపెనీ బదిలీల కోసం టెక్ సంస్థలు తరచుగా ఉపయోగించే ఎల్-1 వీసాల విషయంలోనూ 96.7 శాతం కేసులలో తిరస్కరించబడిన వాటిని అప్పీల్ చేయలేదు.అయితే అప్పీల్స్ పరిష్కరించడానికి రెండు సంవత్సరాల వరకు సమయం పట్టవచ్చని, చాలా కంపెనీలు తక్షణం ఖాళీని భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నందున, ఎక్కువసేపు వేచి ఉండలేవని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు చెబుతున్నారు.

Telugu Visa, Telugu Nri Ups-

అయితే అప్పీల్‌కు బదులు మోషన్ దాఖలు చేయడం ఉత్తమం అంటోంది నీల్ ఎ వీన్రిబ్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ అటార్నీ సంస్థ.అప్పీల్ కంటే మోషన్ ప్రాసెసింగ్ చాలా వేగంగా జరుగుతుంది.ఇందుకు కేవలం 1-3 నెలలు సమయం మాత్రమే పడుతుంది.మరోవైపు ప్రతీ ఏటా జారీ చేసే హెచ్1బీ వీసాల్లో మూడింట రెండు వంతులు భారతీయులే పొందుతున్నారు.హెచ్1బీ వీసాల్లో అధిక భాగం అమెరికన్ టెక్ సంస్థలే దక్కించుకుంటున్నాయి.ఇదే సమయంలో భారతీయ ఐటీ సంస్థల వీసా దరఖాస్తులు పెద్ద మొత్తంలో తిరస్కరణకు గురయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube