హెచ్ 1 బీ వీసాదారులకు గుడ్‌న్యూస్ : ప్రీమియం ప్రక్రియకు ట్రంప్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్  

H 1b Visa Premium Processing Trump 1 - Telugu America, Donald Trump, Government, H1b Visa, Lock Down, Us Citizenship And Immigration Services

హెచ్ 1 బీ వీసాదారులకు ట్రంప్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.కరోనా వైరస్ కారణంగా నిలిపివేసిన ప్రీమియం విధానాన్ని సోమవారం నుంచి (జూన్ 1) ప్రారంభించనున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది.

 H 1b Visa Premium Processing Trump 1

ఈ విధానం ద్వారా దరఖాస్తుదారులకు తమ దరఖాస్తు ఆమోదం పొందినదీ, లేనిది కేవలం రెండు వారాల్లోనే తెలిసిపోతుంది.

లాక్‌డౌన్‌కు పూర్వం అంటే మార్చి 20 లోపు వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఐ-129, ఐ – 140 ఆమోదం కోసం మరోసారి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

హెచ్ 1 బీ వీసాదారులకు గుడ్‌న్యూస్ : ప్రీమియం ప్రక్రియకు ట్రంప్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్-Telugu NRI-Telugu Tollywood Photo Image

గతంలో అప్లై చేయని వారు, ప్రస్తుతం దరఖాస్తు చేసేందుకు వీలుండదు.పై రెండు విభాగాలకు సంబంధించిన ప్రక్రియను మాత్రమే ప్రీమియం విధానంలో చేపట్టాలని యూఎస్‌సీఐఎస్ నిర్ణయించింది.ఇమ్మిగ్రేంట్, నాన్ ఇమ్మిగ్రేంట్ వీసాలకు కంపెనీలు/ యజమానులు దరఖాస్తు చేస్తే సాధారణ ప్రక్రియ పూర్తయ్యేందుకు 6 నుంచి 8 నెలల వ్యవధి పడుతుంది.అయితే అతి తక్కువ సమయంలో తమ దరఖాస్తు భవితవ్యం తేలనుండటంతో ఎంతోమంది ప్రీమియం విధానం వైపు మొగ్గుచూపుతున్నారు.

ఈ విధానంలో దరఖాస్తు రుసుము కింద 12 నుంచి 15 వేల డాలర్లను యూఎస్‌సీఎఎస్ వసూలు చేస్తుంది.ప్రీమియం వీసా ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతాయని అంచనా.వివిధ దేశాలకు చెందిన వృత్తి నిపుణుల హెచ్ 1 బీ వీసా గడువు జూలైలో ముగియనుంది.అమెరికన్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం హెచ్ 1 బీ వీసాపై పనిచేస్తున్న వారి గడువు ముగిసిన 60 రోజుల్లోగా వారి స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వుంటుంది.

ప్రీమియం విభాగంలో ఐ-129, ఐ-140 దరఖాస్తులు ఆమోదం పొందిన పక్షంలో హెచ్ 1 బీ గడువును పొడిగించేంత వరకు అమెరికాలో ఉండేందుకు వెసులుబాటు లభిస్తుంది.వీరి జీవిత భాగస్వాములు, ఆధారపడినవారు (హెచ్ 4) వీసాదారులకు ఇదే అవకాశం ఉంటుంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test