హెచ్ 1 బీపై నిషేధం విధించినా.. డాలర్ డ్రీమ్స్ సజీవం: అమెరికా కల ఇలా నెరవేర్చుకోవచ్చు..!!

అమెరికాలో ఉద్యోగం సంపాదించి జీవితంలో బాగా స్థిరపడాలనేది లక్షలాది మంది భారతీయుల కల.మనదేశంలో ఫారిన్ అనగానే మనసులో మెదిలేది అమెరికాయే.

 H-1b Visa Ban: Indians Rush Towards Eb-5 Visa To Fulfill Their 'american Dream',-TeluguStop.com

అలా అనాదిగా భారతీయ యువతలో అగ్రరాజ్యం పట్ల మక్కువ పెరుగుతూ వస్తోంది.ఇలాంటి పరిస్ధితుల్లో కరోనా సంక్షోభం కానివ్వండి.

ఎన్నికల్లో గెలవాలనే వ్యూహం అవ్వని.ఏదైనప్పటికీ హెచ్ 1 బీ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆయన నిర్ణయం విదేశీయులతో పాటు భారతీయులకు శరాఘాతంలా తగిలింది.

ఏ సమస్యకైనా పరిష్కార మార్గాలు ఉన్నట్లుగానే.

హెచ్ 1 బీ వీసాకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు.ఈ క్రమంలో అమెరికాలో పెట్టుబడులను పెట్టే వలసదారులకు ఇచ్చే ‘‘ ఈబీ-5 ’’ వీసాకు డిమాండ్ పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం ప్రయత్నిస్తున్న హెచ్ 1 బీ, హెచ్ 4 వీసాదారులు ప్రధానంగా ‘‘ ఈబీ 5’’ వీసాల వైపునకు దృష్టిసారిస్తున్నట్లు పేర్కొంటున్నారు.దశాబ్ధాలపాటు అమెరికాలో ఉద్యోగం చేస్తూ.

ఇప్పటికీ గ్రీన్‌కార్డును సంపాదించలేని హెచ్ 1బీ, హెచ్ 4 వీసాదారులు ‘‘ఈబీ5’’ వీసాల వైపునకు మొగ్గు చూపుతున్నారని ఇమ్మిగ్రేషన్ సంస్థ ‘‘క్యాన్‌యామ్’’ తెలిపింది.

Telugu American Dream, Donald Trump, Eb Visa, Visa, Visaban, Indians-Telugu NRI

2019, నవంబర్‌లో ఈబీ-5 వీసా కోసం పెట్టే పెట్టుబడులను 5 లక్షల డాలర్ల నుంచి 9 లక్షల డాలర్లకు పెంచడంతో వీటికి డిమాండ్ తగ్గింది.కానీ ఎప్పుడైతే ట్రంప్ హెచ్ 1 బీ వీసాపై నిషేధం విధించారో ఈబీ-5 వీసాలకు ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది.అసలు ఇంతకీ ఈబీ 5 వీసా అంటే ఏంటో చూస్తే: దీనిని పెట్టుబడిదారుల వీసాగా అభివర్ణిస్తారు.ఇది జారీ చేయాలంటే అమెరికాలోని ఏదైనా సంస్థలో కనీసం 9 లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టాలి.అలాగే ఆ సంస్థ కనీసం పది మంది అమెరికన్లకు ఉపాధిని కల్పించాలి.

ఒక్కో దేశానికి ఏడాదికి గరిష్టంగా 700 వరకు ఈబీ-5 వీసా కోటాను అనుమతిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube