హెచ్-1, ఎల్-1 వీసాల్లో కీలక సంస్కరణలు.. ఇక వారికే తొలి ప్రాధాన్యం: అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు

అమెరికా బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని చాలా మంది కల.అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా ఫస్ట్ నినాదంతో ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు.

 H-1b Bill Introduced In Us Congress To Give Priority To Us Educated Foreigners,-TeluguStop.com

ఈ మేరకు రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం శుక్రవారం ‘‘ ది హెచ్ 1 బీ అండ్ ఎల్ 1 వీసా రిఫార్మ్ యాక్ట్ పేరిట శుక్రవారం కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు.

Telugu America, Donald Trump, Congress, Foreigners-Telugu NRI

దీని ప్రకారం అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు.అలాగే అమెరికా పౌరుల ఉపాధి కాపాడటం కూడా ఓ ఉద్దేశ్యమని బిల్లులో ప్రస్తావించారు.ఇదే సమయంలో వీసాదారుల వల్ల ఇతర అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనితీరు, పనిప్రదేశంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని స్పష్టం చేశారు.

ప్రధానంగా తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్ 1 బీ, ఎల్ 1 ఉద్యోగులను దిగుమతి చేసుకుని వారిని సొంతదేశానికి పంపుతున్న ఔట్ సోర్సింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని బిల్లు ప్రతిపాదించింది.

Telugu America, Donald Trump, Congress, Foreigners-Telugu NRI

దీని ప్రకారం…50 కంటే ఎక్కువ మంది పనిచేస్తూ వారిలో సగం కంటే ఎక్కువ మంది హెచ్ 1 బీ లేదా ఎల్ 1 వీసాదారులు ఉన్నట్లయితే, మరింత మంది హెచ్ 1 బీ వీసాదారుల్ని నియమించుకోవడాన్ని నిషేధించాలని బిల్లులో పేర్కొన్నారు.అలాగే ఉద్యోగుల నియామకాలు, వీసా నిబంధనల విషయంలో ఆయా కంపెనీలు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు లేబర్ డిపార్ట్‌మెంట్‌కు మరిన్ని అధికారాల్ని కట్టబెట్టేలా ప్రతిపాదించారు.కంపెనీలు హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాదారుల సమగ్ర వివరాలు అందజేసేలా చూడాలని బిల్లులో పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube