వలస విధానంపై బైడెన్ స్పీడు.. రిపబ్లికన్ల అక్కసు: హెచ్ 1 బీపై ఆంక్షలు తెస్తూ బిల్లు

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ ముందుకు సాగుతున్నారు జో బైడెన్.స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వలసలను పూర్తిగా అడ్డుకునేందుకు గాను డొనాల్డ్ ట్రంప్ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అవలంభించారు.

 H 1b Three Republicans Bring Legislation In Congress To End Allure Of Cheap Foreign Labour-TeluguStop.com

తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇమ్మిగ్రేషన్ పాలసీని సమీక్షిస్తానని ఇచ్చిన హామీ మేరకు బైడెన్ నిర్ణయాలను తీసుకుంటున్నారు.హెచ్ 1 బీ వీసా, హెచ్ 4, గ్రీన్ కార్డులపై నిషేధాన్ని ఎత్తివేశారు.

లాటరీ విధానంలో ఈ ఏడాది హెచ్ 1 బీ జారీ చేస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.అలాగే మెక్సికో సరిహద్దుల్లోని గోడ నిర్మాణాన్ని రద్దు చేయడంతో పాటు అక్రమ వలసదారులకు దశల వారీగా అమెరికాలో అడుగుపెట్టేలా చర్యలు తీసుకుంటామని బైడెన్ ప్రకటించారు.

 H 1b Three Republicans Bring Legislation In Congress To End Allure Of Cheap Foreign Labour-వలస విధానంపై బైడెన్ స్పీడు.. రిపబ్లికన్ల అక్కసు: హెచ్ 1 బీపై ఆంక్షలు తెస్తూ బిల్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆయన చర్యలపై ప్రతిపక్ష రిపబ్లికన్లు విరుచుకుపడుతున్నారు.వలసదారులను దేశంలోకి అనుమతించి అమెరికా జాతీయ భద్రతను బైడెన్ ప్రమాదంలో పడేశారంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

తాజాగా ముగ్గురు రిపబ్లికన్లు బైడెన్ యంత్రాంగంపై అక్కసు వెళ్లగక్కారు.హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో సమూలమార్పును కోరుతూ ముగ్గురు రిపబ్లికన్ సభ్యులు అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు.అమెరికన్ సంస్థలు విదేశీ ఉద్యోగులను చేర్చుకోకుండా, స్థానికులకు భారీ మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించటమే ఈ బిల్లు లక్ష్యం.హెచ్-1బీ వీసాపై ఇటీవల చేపట్టిన నియమకాలు సహా, భవిష్యత్తు నియామకాలను కూడా అడ్డుకునేందుకు మో బ్రూక్స్, మాట్ గేట్జ్, లాన్స్ గూడెన్ ఈ బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.

జాబ్స్ ఫస్ట్ యాక్ట్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా వలస విధానంతో పాటు అమెరికన్ జాతీయత చట్టంలో మార్పులు చేయడం ద్వారా హెచ్-1బీ వీసా ప్రక్రియను ప్రక్షాళన చేయాలని ఈ ముగ్గురూ ప్రతిపాదించారు.నాన్ ఇమ్మిగ్రేంట్ వీసా…హెచ్‌1బీతో వేలమంది ఐటీ నిపుణులను భారత్‌, చైనాల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు.

అలాగే గతంలో అర్హతలతో సంబంధం లేకుండా 50వేలకు పైగా గ్రీన్ కార్డులను జారీ చేయడం వల్ల అమెరికా ప్రయోజనాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు.దీనివల్ల సమాన అర్హతలున్న అమెరికన్ యువత ఉపాధి అవకాశాలు కోల్పోతోందని రిపబ్లికన్ సభ్యులు ఆరోపించారు.

ఒకవేళ హెచ్‌1బీ వీసాతో విదేశీ నిపుణులను అమెరికాకు తీసుకొచ్చేటట్లయితే వారి వార్షిక వేతనం అదే స్థాయి అమెరికన్‌ ఉద్యోగులకు ఇచ్చే వేతనం కన్నా అధికంగా ఉండాలని ఆ బిల్లులో పొందుపరిచారు.డొనాల్డ్‌ ట్రంప్‌ దిగిపోవడానికి ముందు ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చిన కొత్త హెచ్‌1బీ వీసా విధానాన్ని అమలు చేయాలన్నది ఈ బిల్లు సారాంశం.

ఈ బిల్లులో పొందుపరిచిన అంశాల ప్రకారం కంపెనీ యాజమాన్యం… కార్మికశాఖ కార్యదర్శికి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.అంతేకాకుండా హెచ్‌1బీ ఉద్యోగాల వల్ల రాబోయే రెండేళ్ల కాలంలో అమెరికన్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడదన్న హామీని కూడా యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

విదేశీయులకు గ్రీన్‌కార్డుల మంజూరు కోసం నిర్వహించే లాటరీ విధానాన్ని కూడా ప్రభుత్వం నిలిపివేయాల్సి ఉంటుంది.అయితే అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లదే పైచేయి కావడం వల్ల ఈ బిల్లుకు ఆమోదం లభించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#Mexico #Joe Biden #Trump #Green Card

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు