అది జిల్లా కలెక్టర్ కార్యాలయం... కాని అక్కడ అంతా బూతు మయం  

Gwalior Collectorate Officials Watch On Duty-

ఎదురుగా కంప్యూటర్, అందులో ఇంటర్నెట్ సదుపాయం, ఆపై ఆన్ లైన్ లో లెక్కలేనన్ని సైట్స్.ఇవన్ని ఇప్పుడు ఎవరిని కుదురుగా ఉంచడం లేదు.చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే పనులు పక్కన పెట్టి పూర్తిగా అందులో లీనమైపోతున్న జనం..

Gwalior Collectorate Officials Watch On Duty--Gwalior Collectorate Officials Watch Adult Videos On Duty-

ఎదురుగా కంప్యూటర్ ఉంటే దానిని ఇష్టానుసారంగా వాడేస్తున్న మనం ఎంత నీచమైన స్థితికి దిగాజారిపోయామో తెలుసుకోలేకపోతున్నాం.ఇక ఈ మధ్య టిక్ టాక్ యావలో పడి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా పనులు పక్కన పెట్టి అందులో కాలక్షేపం చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ కలెక్టరేట్ కార్యాలయంలో కొన్ని దారుణాలు బయటపడ్డాయి.

నిత్యం ప్రజులు వందల సంఖ్యలో తమ సమస్యలు మొరపెట్టుకోవడానికి వచ్చే కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు దారితప్పారు.కలెక్టర్ కార్యాలయాన్ని ఒక ఇంటర్నెట్ కేఫ్ గా మార్చేసి పోర్న్ సినిమాలు, హాట్ వీడియోలు చూసే కేంద్రంగా మార్చేసారు.పనులు అన్ని వదిలేసి కంప్యూటర్ కి అతుక్కుపోతూ గంటల తరబడి అందులోనే లీనమైపోతున్నారు.

ఆఫీసు పని వేళ్లలో కలెక్టరేట్ ఉద్యోగులు ఇంటర్నెట్‌లో ఎక్కువగా గడుపుతున్నారని జిల్లా కలెక్టర్‌ అనురాగ్ చౌదరికి ఫిర్యాదులు రావడంతో ఉద్యోగుల కంప్యూటర్లపై నిఘా పెట్టాలని సైబర్ టీమ్‌ను ఆయన ఆదేశించారు.దీనిలో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి.ఉద్యోగులు హాట్‌స్టార్, యూట్యూబ్, పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నట్లు తేలింది.

కొందరు అధికారులైతే ఏకంగా పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు వెల్లడైంది.దీంతో ఆ కలెక్టర్ కంప్యూటర్ల ఐపీ అడ్రస్‌లు సేకరించి, ఆరుగురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు.ఆఫీసు పనివేళల్లో పనిచేయకుండా అసభ్యకర వీడియోలు చూడటం, డౌన్‌లోడ్ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఇప్పుడు ఈ వ్యవహారం ఆ జిల్లాలో సంచలనంగా మారింది.