గుత్తా మంత్రి క‌ల నిజం కాబోతోంద‌ట‌...

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు టీఆర్ఎస్‌లో చేరుతున్నాన‌ని గుత్తా సుఖేందర్ వెల్ల‌డిస్తూ, గ‌త కొద్ది రోజులుగా తెరాసలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి తెర‌దించారు.సోమవారం మాజీ ఎం.

 Gutta And Vivek Join In Trs-TeluguStop.com

పి వివేక్‌తో క‌ల‌సి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చినా ,కాంగ్రెస్ పార్టీలో అంత:కలహాలు మనోవేదనకు గురి చేస్తునాయని,.బంగారు తెలంగాణ నిర్మాణంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి సహకరించేందుకు తెరాస‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వెల్లడించారు.

కాగా మంత్రి కావాల‌న్న త‌న ఆకాంక్ష‌ను కేసీఆర్ తీర్చ‌నున్నార‌ని , తన వ‌ర్గీయుల‌ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీలు పొందినందునే పార్టీ మారాల‌ని భావించిన గుత్తా, త‌న‌తో పాటుగా వివేక్ త‌దిత‌రుల‌ను సంప్ర‌దించి, చేరిక‌కు ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం.త్వ‌ర‌లోనే గుత్తా రాష్ట్ర మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తూ త‌న ఎం.పి ప‌ద‌వికి రాజీ నామా చేస్తార‌ని, ఆయ‌న స్ధానంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పళ్లా రాజేశ్వర్ రెడ్డిని పార్లమెంట్ కు పంపి, పట్టభద్రలు కోటా నుంచి గుత్తాను మండ‌లికి తీసుకు వ‌చ్చేలా ప్లాన్ గీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఇప్పుడు గుత్తా రాజీ నామాతో నల్గొండ స్ధానానికి ఉప ఎన్నిక జ‌రిగితే అక్క‌డ గెలుపు తెరాస ప్ర‌తిష్ట మ‌రింత పెంచుతుంద‌న్న భావ‌నని ప‌లువురు నేత‌లు చెప్ప‌డంతో ఈ విష‌యంలో కేసీఆర్ కూడా సై అన్న‌ట్లు తెలుస్తోంది.

గుత్తా గులాబీ గూటికి చేరాక రాబోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి కావ‌టం ఖాయ‌మ‌న్న‌ది ఆయ‌న వ‌ర్గీయుల ప్ర‌చారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube