టీ మండలి చైర్మన్‌ ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ పదవి కాలం పూర్తి అవ్వడంతో ఇటీవలే కొత్త చైర్మన్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.టీఆర్‌ఎస్‌కు తప్ప మరే పార్టీకి కూడా మండలిలో చైర్మన్‌ అయ్యే బలం లేక పోవడంతో ఇతర పార్టీలు ఏవి కూడా చైర్మన్‌ పదవికి నామినేషన్‌ వేయలేదు.

 Gutha Sukender Reddy Is New Chairman Legislative Council-TeluguStop.com

నిన్నటితో చైర్మన్‌ పదవి నామినేషన్‌ పూర్తి అయ్యింది.మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన గుత్తా సుంఖేందర్‌ రెడ్డి మాత్రమే మండలి చైర్మన్‌ పదవి కోసం నామినేట్‌ దాఖలు చేయడం జరిగింది.

దాంతో నామినేషన్‌ ఒక్కటే రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం లాంచనమే.

నిన్న మద్యాహ్నం సమయంలో టీఆర్‌ఎస్‌ ప్రముఖులు మరియు మంత్రులు దగ్గరుండి గుత్తా సుఖేందర్‌ రెడ్డితో నామినేషన్‌ దాఖలు చేయించారు.

ఈ సందర్బంగా గుత్తా వెంట మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇంకా జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, హరీష్‌ రావు, సత్యవతి రాథోడ్‌, కడియం శ్రీహరి, నాయిని, కర్నె ప్రభాకర్‌ ఇంకా పలువురు మండలి చైర్మన్‌ పదవికి గుత్తాను బలపర్చుతున్నట్లుగా మండలి చైర్మన్‌ ఎన్నిక అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube