తొడగొట్టి టీడీపీ ఎమ్మెల్యే యాక్షన్ ? వైసీపీ రియాక్షన్ ఏంటో ? 

ఎక్కడికక్కడ ఏపీలో అధికార పార్టీ భయంతో టీడీపీ నేతలంతా ప్రభుత్వం పైన, ఆ పార్టీ నాయకుల పైన విమర్శలు చేసేందుకు వెనుకడుగు వేస్తూ వస్తున్నారు.ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,  టార్గెట్ అవుతూ, తమ రాజకీయ జీవితానికి ఇబ్బందులు ఏర్పడటంతో పాటు, ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుందనే భయంతో ఎక్కడికక్కడ మౌనంగానే ఉంటూ వస్తున్నారు.

 Gutajala Ex Mla Yarapathineni Srinivasarao Sensational Comments, Tdp, Chandrabab-TeluguStop.com

కొద్దిమంది మాత్రమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.హడావుడి చేస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా పలనాడు లో మరో రాజకీయ దుమారం రేగింది.

టిడిపి కీలక నాయకుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వైసీపీ నాయకులు ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు,  త్వరలోనే వైసీపీ నాయకులు అందరికీ బుద్ధి చెబుతాం అంటూ తొడగొట్టి మరీ వారికి సవాల్ విసరడం సంచలనంగా మారింది.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం లో టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన సభకు హాజరైన యరపతినేని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పై సంచలన విమర్శలు చేశారు.ఇక్కడ ఎమ్మెల్యే వారాలబ్బాయి గా మారిపోయారని, వారానికి రెండు సార్లు వచ్చి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు.

గురజాల ను ప్రత్యేక జిల్లాగా చేసే విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.వైసీపీ నేతలు కబడ్ధార్ అంటూ తొడగొట్టి మరి ఆయన విమర్శలు చేశారు.

Telugu Chandrababu, Mahesh Reddy, Ycp Mla-Telugu Political News

అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే కాసు మహేష్ రియాక్ట్ అయ్యారు.టిడిపి నాయకులకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరన్నారు.ఐదేళ్ళ పాటు అవినీతి అక్రమాలకు పాల్పడిన టిడిపి నాయకులకు ప్రజలకు తగిన విధంగా బుద్ధి చెబుతారని యరపతినేని ని ఉద్దేశించి మహేష్ రెడ్డి విమర్శలు చేశారు .మీరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా టిడిపిని ప్రజలెవరూ నమ్మరని కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.అయినా తొడగొట్టడాలు మీసం తిప్పడం పల్నాడులో కామన్ అని, ఎవరు పట్టించుకోనవసరం లేదని చెప్పుకొచ్చారు.అయితే మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తొడగొట్టి మరీ విమర్శలు చేసిన వ్యవహారాన్ని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి లైట్ తీసుకున్న, వైసీపీ నేతలు మాత్రం సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఆయన ఏ దైర్యంతో ఈ విధంగా తొడలు కొడుతున్నారని, ఆయన విమర్శలను తేలికగా తీసుకుని ఊరుకుంటే, మరింతగా ఆయన ప్రభుత్వం పై కామెంట్ చేస్తారని, అందుకే ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు.ఇప్పటికీ యరపతినేని మైనింగ్ వ్యవహారంపై ప్రభుత్వ దర్యాప్తుకు ఆదేశించింది.

ఈ క్రమంలోనే ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube