200 మంది పిల్లలు ఆత్మాహుతి కి సిద్దం - డేరా అనుచరులు   Gurmit Singh Baba Followers Issued Threat Letters     2017-09-28   04:02:11  IST  Raghu V

గుర్మిత్ సింగ్ అలియాస్ డేరా బాబా తన అస్రమంలో ఉండే ఇద్దరు సాధ్వీల మీద అత్యాచారం చేసిన విషయంలో ఎన్నో ఏళ్ల తరువాత ఇప్పుడు శిక్షని అనుభవిస్తున్న విషయం తెలిసిందే..అయితే డేరా అరెస్ట్ అయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒక్కో విషయం బయటకి వస్తున్నాయి..అవి కూడా సంచలనం కలిగించే అంశాలు కావడం విశేషం.

డేరా బాబా అక్రమాలు అతగాడు చేసిన దారుణాలు మీడియాలో సీరియల్ గా వస్తున్న వైనంపై ఆయన శిష్యులు మండిపడుతున్నారు. డేరా సచ్చా సౌధా అనుబంధ సంస్థ కుర్బానీ లీగ్ చేసిన తాజా ప్రకటన సంచలనంగా మారింది. డేరా బాబా మీద వ్యాఖ్యలు చేస్తున్న పోలీసులు.. జర్నలిస్టులు.. మాజీ అనుచరులు ఎవరైనా సరే.. గుర్మీత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే వారందరిని ఏసేస్తామంటూ చేస్తున్న వార్నింగ్ లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే వీటిమీద కొంతమందికి హెచ్చరిక లేకలు అందినట్టు సమాచారం.డేరా అనుభంద సంస్థ కుర్బాని ఒక సంచలన ప్రకటన కూడా చేసింది. గుర్మిత్ బాబా మీద ఆరోపణలు చేసినవారిని చంపేందుకు ఇప్పటికే మేము రెడీ అయ్యాము అని. డేరా బాబా ఆశ్రమానికి సంభదించిన 200 పిల్లలు ద్వారా వీళ్ళని చంపే ప్లాన్ వేసినట్టు చెప్పారు..వీళ్ళందరూ ఆత్మాహుతి దాడులకి సిద్దంగా ఉన్నారు అని వెల్లడించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. హర్యానా రాష్ట్ర అధికారపక్షంలో ఉన్న బీజేపీ తమను మోసం చేసిందని కుర్బానీ లీగ్ ఆరోపిస్తోంది.

ఇప్పుడు పోలీసులు ఈ లేఖలపై దృష్టి సారించారు..ఇవి ఎక్కడినుంచి వస్తున్నాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా లేక పంపుతున్న వారిమీద నిఘా ఉంచామని తెలిపారు. డేరా బాబా విషయంలో ఒకరి తరువాత ఒకరు బయటకి వచ్చి బాబా చేసిన అక్రమాలని వెల్లడిస్తున్నారు అలాంటి వారిని భయపెట్టాలనే ఉద్దేశ్యంతో ఇలా బెదిరింపులకి పాల్పడుతున్నారు అని భావిస్తున్నారు పోలీసులు.