ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఇండియా మరోసారి ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంది.పంజాబ్‌లోని పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పన్నెండు గంటల పోరాటం తరువాత పంజాబ్‌ పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను నేలకూల్చారు.

 Gurdaspur’s 12 Hours Of Terror-TeluguStop.com

అంతకుముందు ఉగ్రవాదుల తూటాలకు నలుగురు పోలీసు అధికారులు, ముగ్గురు పౌరులు మృతి చెందారు.ముగ్గురు ఉగ్రవాదులను పాక్‌ సరిహద్దుల్లోని దిననగర్‌ పట్టణంలో పోలీసులు హతమార్చారు.

మిలటరీ దుస్తుల్లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారేనని అనుమానిస్తున్నారు.ఉగ్రవాదులు గురుదాస్‌పూర్‌ రీజియన్లో ఒక టెంపోను అపహరించేందుకు విఫలయత్నం చేశారు.

ఆ సమయంలో వారి కాల్పులకు రోడ్డుపక్కన వ్యాపారం చేసుకునే తినుబండారాల దుకాణం యజమాని చనిపోయాడు.చండీఘర్‌కు వెళుతున్న బస్సుపై టెర్రరిస్టులు కాల్పలు జరపగా ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

ఆ తరువార వారు తెల్లమారుతి కారుపై కాల్పులు జరిపారు.రైల్వే సమీపంలో ఐదు బాంబులను పోలీసులు కనిపెట్టారు.

ముంబయి పేలుళ్ల దోషి, పాక్‌కు చెందిన తీవ్రవాది యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేశాకే ఈ ఉగ్రదాడులు జరగడం గమనార్హం.అంటే యాకూబ్‌కు మరణ శిక్ష విధించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించారన్నమాట.

ఈ ముగ్గురు ఉగ్రవాదులను చంపినంత మాత్రాన ముప్పు తొలగిపోయినట్లు కాదు.ముప్పయ్యో తేదీన ఉరిశిక్ష అమలు జరిగాక మళ్లీ దాడులు చేసే అవకాశం ఉంది.

అజ్మల్‌ కసబ్‌, అఫ్జల్ గురును ఉరితీశాక పాక్‌ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube