టీడీపీ నుంచీ వైసీపీలోకి “నిమ్మకాయల”..   Guntur TDP Leader Nimmakayala Ready To JUMP Into YSRCP     2018-03-26   00:53:21  IST  Bhanu C

గుంటూరు జిల్లా రాజకీయాలు ఏపీ రాజకీయాలని సైతం ఎంతో ప్రభావిస్తం చేస్తుంటాయి..ఈ జిల్లాలో జరిగే సమీకరణాలు మరెక్కడా జరగవంటే ఆశ్చర్యం కలుగక మానదు..అయితే ఇప్పుడు అధికార మరియు ప్రతిపక్ష పార్టీ అధినేతలు ఇద్దరు కూడా తమ బలాబలాలు అన్నీ ఈ జిల్లాపైనే ప్రదర్శిస్తున్నారు..ఇక్కడ ఎవరిదీ పైచెయ్యి అయితే వారు వచ్చే ఎన్నికల్లో సగభాగం విజయ సాధించినట్టే..అందుకే జగన్ పాదయాత్ర సందర్భంగా భారీ చేరికలు గుంటూరు నుంచీ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు….అంటే కాదు జగన కి కూడా పాదయాత్ర సందర్భంగా విశేషమైన స్పందన రావడం మరియు కలిసొచ్చే అంశాలు గా కనిపిస్తున్నాయి..అయితే తాజాగా ఓ నేత చేరిక గుంటూరు టిడిపిని కలవర పెడుతోంది..

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో శాసన సభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మకాయల రాజనారాయణ జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారుని…అది కూడా ఈ నెల 27న సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా వైసిపిలోకి చేరుతున్నారనే విషయాన్ని ఖాయం చేస్తున్నారు వైసీపి నేతలు..

అంతేకాదు ఈ విషయంపై సదరు నేత నిమ్మకాయల కూడా దృవీకరించారు…అంతేకాదు గత కొంతకాలంగా నిమ్మకాయలకి పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని..అవమానాలు తప్ప పార్టీ పరంగా నాకు జరిగిన మేలు లేదని నిమ్మకాయల గతంలోనే పలువురు నేతల దగ్గర ప్రస్తావించాడు అని తెలిసింది..అందుకే వైసీపిలోకి వెళ్తున్నట్లుగా ఆయన దృవీకరణ కూడా చేశారు..అంతేకాదు గత కొంతకాలంగా టిడిపి కి దూరంగా ఉంటున్న ఆతుకూరి నాగేశ్వరరావు కూడా వైసీపీలో చేరే అవకాశాలున్నాయని నిమ్మకాయల వర్గీయులు చెబుతున్నారు. మొత్తానికి జగన్ పాదయాత్ర వైసీపి పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు ..