వైసీపీ క‌మ్మ వ‌ర్సెస్ టీడీపీ క‌మ్మ‌... రాజ‌కీయం వేడెక్కిందిగా...!

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.మామూలుగానే ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.

 Ycp Kamma Vs Tdp Kamma, Guntur, Vinukonda, Politics, Kamma Politics, Tdp, Ysrcp-TeluguStop.com

అందుకే ఇక్కడ టీడీపీదే పైచేయిగా ఉండేది.అయితే 2019 ఎన్నికల్లో మాత్రం వినుకొండలో వైసీపీ జెండా ఎగిరింది.

వైసీపీ నుంచి గెలిచింది కూడా కమ్మ నేతే.బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే  జి‌వి ఆంజనేయులు, బొల్లా చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే వైసీపీ నుంచి కమ్మ ఎమ్మెల్యేనే ఉండటంతో, నియోజకవర్గంలో కమ్మ వాళ్ళకు పెద్ద ఇబ్బంది లేదని అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా టీడీపీకి చెందినవారిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.ఈ క్రమంలోనే నియోజకవర్గంలో విగ్రహ రాజకీయం తెరపైకి వచ్చింది.నియోజకవర్గంలో ఉన్న ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలని హఠాత్తుగా తొలగించారు.దీంతో తెదేపా శ్రేణులు భగ్గుమన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేనే ఇదంతా చేయిస్తున్నాడని చెప్పి, ఆంజనేయులు విమర్శలు చేస్తున్నారు.

ఇక ఇక్కడే ఆంజనేయులు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

ఎన్నికల సమయంలో బొల్లా కమ్మ ఓట్లు ఆకట్టుకునేందుకు, గెలిచాక టీడీపీలో వచ్చేస్తానని చెప్పి మరీ, ఓట్లు వేయించుకున్నారని జి‌వి ఆంజనేయులు ఆరోపిస్తున్నారు.వాస్తవానికి ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రచారమే జరిగిందని తెలుస్తోంది.

బొల్లా టీడీపీలోకి వస్తాననే చెప్పే కమ్మ ఓట్లు వేయించుకున్నారని టాక్.కానీ టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో, బొల్లా వైసీపీలో దూకుడుగా ఉంటున్నారని తెలుస్తోంది.

రాజకీయంగా టీడీపీని నియోజకవర్గంలో తోక్కెసే ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే ఈ తరహా రాజకీయాలకు తెరలేపారని అంటున్నారు.అయితే బొల్లా ఎంత ప్రయత్నించినా వినుకొండలో టీడీపీ అణిచివేయడం సాధ్యం కావడం లేదని తెలుస్తోంది.

పైగా ఇప్పుడు విగ్రహాలు తొలగించడం వల్ల ఎన్నికల్లో బొల్లాకు సపోర్ట్ ఇచ్చిన కమ్మ ఓటర్లు, ఇప్పుడు యాంటీ అయ్యారు.దానికితోడు అమరావతి ఇష్యూ బొల్లాకు నెగిటివ్ అవుతుంది.

ఏదేమైనా వైసీపీ క‌మ్మ వ‌ర్సెస్ టీడీపీ క‌మ్మ నేత‌లుగా ఉన్న బొల్లా వ‌ర్సెస్ ఆంజ‌నేయులు మ‌ధ్య న‌డుస్తోన్న వార్ గుంటూరు రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube