“రాయపాటి సవాల్”..కన్నా ఓటమే “నా లక్ష్యం”       2018-05-17   05:03:30  IST  Bhanu C

రాయపాటి ఈ పేరుని పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోయే నేతగా రాజకీయ కురువృద్దుడిగా పేరున్న ఆయన కొంతకాలం క్రితం రాజకీయాలకి సెలవు ప్రకటిస్తున్నానని తెలిపిన విషయం విధింతమే అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు..మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు అయితే ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం లేకపోలేదు అంటున్నారు ఆయన అనుచరులు..అసలు విషయం ఏమిటంటే..

రాయపాటి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో బద్దవైరం ఉండేది. పరస్పరం విమర్శలు ఆరోపణలు చేసుకున్నారు..దాంతో వారు ఇరువురు పరువు నష్టం దావా కూడా వేసుకున్నారు. అయితే పదేళ్ళ కన్నా గుంటూరులో తన ప్రాభల్యం అలాగే కోసనాగేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూనే వచ్చారు అయితే 2014 ఎన్నికలు మాత్రం కన్నా రాజకీయ జీవితానికి పులిస్టాప్ పెట్టాయి.

కన్నా కి రాజకీయ బిక్ష పెట్టిన కావూరి బీజేపి లో చేరడంతో కన్నా సైతం ఆయన వెంటే బీజేపి లో చేరారు.. అయినా ఎవరూ ఆయన్ని పట్టించుకోకపోవడంతో తర్వాత టిడిపిలో చేరేందుకు ప్రయత్నించారు. అక్కడ పట్టించుకోకపోవడంతో వైకాపాలో చేరేందుకు జగన్‌ ను సంప్రదించారు..అయితే కేంద్రం కన్నా చేరికపై అడ్డు చెప్పడంతో పాటు బీజేపి అధ్యక్షుడిగా ప్రకటించారు..రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని భావించిన రాయపాటి కన్నాను దెబ్బకొట్టేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారని ఆయన అభిమానులు చెప్తున్నారు.

ఇదిలాఉంటే అటు కావురితో ఇటు కన్నా తో రాజకీయ వైరం ఉన్న రాయపాటి మళ్లీ వారిద్దరూ రాజకీయంగా తెరపైకి రాకుండా ఉండాలంటే తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోకూడదని భావించి మళ్లీ గుంటూరు రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు..అయితే తన తనయుడు రంగారావు ని ఇక రాజకీయాల్లోకి దింపి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా అనూహ్యంగా మళ్ళీ తెరపైకి వచ్చి ప్రకటన చేయడంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు..అంతేకాదు రాయపాటి అభిమానులు కన్నా కి థాంక్స్ చెప్తున్నారు.