సినిమా ప్రభావంతో అతను ఎలాంటి పని చేసాడో తెలుసా.? జనతా గ్యారేజ్ అని వాట్సాప్ గ్రూప్ చేసి అందులో.!   Guntur Man Creates Janatha Garage Hulchul With Knife     2018-11-06   08:31:29  IST  Sainath G

సినిమాల ప్రభావం మనుషులపై గట్టిగా ఉంటుందనడానికి ఎన్నో ఉదాహరణలు. ఎందుకంటే అభిమానులు హీరోల స్థానంలో తమను తాము ఊహించుకుంటారు. కథానాయకుల్లా షర్ట్‌లు, ఫ్యాషన్, హెయిర్ స్టైల్ ఫాలో అవుతారు.కొద్దిరోజుల క్రితం విడుదలైన జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన వద్దకు వచ్చి బాధలు చెప్పుకున్న వారి కష్టాలు తీరుస్తాడు.ఆ సినిమా చూసి ఇప్పుడు ఓ యువకుడు అదే ఫాలో అయ్యాడు. ఈ ఘటన గుంటూరు లో చోటుచేసుకుంది.!

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ అనే యువకుడు జనతా గ్యారేజ్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి… ఎవరికైనా సమస్య ఉంటే జనతా గ్యారేజ్‌లో సెటిల్ చేస్తానని మెసేజ్‌లు పంపేవాడు.. అలా ఎవరు పడితే వారి మీదకు వెళ్లిపోవడం.. వాళ్లను చావబాదడం చేసేవాడు.

Guntur Man Creates Janatha Garage Hulchul With Knife-

రోడ్డుపైనే కత్తి చేతపట్టుకుని తిరుగుతూ మొబైల్‌లో మాట్లాడుతూ రావాలని పిలుస్తూ హంగామా చేశాడు. అతనితో పాటు పలువురు వ్యక్తులు వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా ప్రదీప్ అరాచకాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. కానీ తాజాగా రోడ్డుపైనే కట్టి పట్టుకొని హల్చల్ చేయడంతో స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై అడీషనల్‌ ఎస్పీ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారిస్తున్నారు.