అమెరికా : ఐస్‌లేక్‌లో తెలుగు దంపతుల గల్లంతు.. భార్య మృతి, భర్త కోసం భారీ రెస్క్యూ ఆపరేషన్

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు దంపతులు సరస్సు దాటుతూ గల్లంతయ్యారు.

 Guntur Based Telugu Nri Couple Missed In America Details, Guntur ,telugu Nri Cou-TeluguStop.com

అధికారుల రెస్క్యూ ఆపరేషన్‌లో భార్య మృతదేహం లభించగా.భర్త కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందినప ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివసిస్తున్నారు.

వీరిద్దరూ అక్కడే ఉద్యోగం చేస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం ఫినిక్స్ ప్రాంతంలో విహార యాత్రకు వెళ్లారు.

మంచు తుఫాన్ కారణంగా వీరు పిక్నిక్ వెళ్లిన ప్రాంతంలోని సరస్సు గడ్డకట్టుకుపోయింది.అయితే దీనిపై నిలబడి ఫోటోలు దిగుతూ ముందుకు సాగుతుండగా మంచు కుంగిపోయింది.

దీంతో నారాయణ, హరిత దంపతులు సరస్సులోని మంచులో కూరుకుపోయారు.అయితే పిల్లలు ఐస్‌లేక్ ఒడ్డునే వుండటంతో వారు అరుపులు, కేకలు పెట్టారు.వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.ఇప్పటి వరకు హరిత మృతదేహం లభించగా… సీపీఆర్ చేసి ఆమెను రక్షించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

అయితే నారాయణ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న పాలపర్రులోని నారాయణ తల్లిదండ్రులు, బంధుమిత్రులు విషాదంలో కూరుకుపోయారు.

Telugu America, Americabomb, Bomb Cyclone, Guntur, Haritha, Muddana Yana, Muddan

ఈ ఏడాది జూన్‌లో నారాయణ దంపతులు చివరిసారిగా పాలపర్రు వచ్చి… కొద్దిరోజుల పాటు బంధుమిత్రులతో సంతోషంగా గడిపి అమెరికా వెళ్లారని .అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని వారు వాపోతున్నారు.ఇకపోతే.బాంబ్ సైక్లోన్ కారణంగా అమెరికా, కెనడాలు వణికిపోతున్నాయి.ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీలకు పడిపోవడంతో జనం బయట కాలు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు.రోడ్లు, రైలు మార్గాలపై అడుగుల మందాన మంచు పేరుకుపోవడంతో అధికారులు, సిబ్బంది రాకపోకలను పునరుద్దరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అటు దాదాపు 16 వేల విమాన సర్వీసులు సైతం రద్దయ్యాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube