పట్టపగలే అమెరికాలో....పోలీస్ స్టేషన్ పై కాల్పులు

ప్రపంచం లో అభివృద్ది ఎంత మాత్రం ఉందో తెలిదు కాని, వైలెన్స్ మాత్రం ఖచ్చితంగా రోజురోజుకు పెరుగుతూనే ఉంది.అగ్రరాజ్య అమెరికా లో జరిగే కాల్పుల గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉంటాం.

 Gunman Allegedly Attacks Nypd Twice In 12 Hours-TeluguStop.com

కొందరు చిన్న చిన్న కారణాలకే ఉద్వేగానికి లోనై తప్పులు చేస్తారు, మరికొందరు మానసిక పరిస్థితి సరిగా లేక తప్పులు చేస్తుంటారు.తాజాగా అమెరికాలో న్యూయార్క్ నగారంలో జరిగిన ఒక సంఘటన చర్చనీయంశంగా మారింది… వివరాల్లోకి వెళితే

అమెరికాలో న్యూయార్క్ నగరంలోని బ్రోంక్ ప్రాంతంలోగల పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం 8 గంటలకు కాల్పులు జరిగాయి.

అప్పటి వరకు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు, ఒక వ్యక్తి సాయుధుడై పోలీస్ స్టేషన్ కు వచ్చి, ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.ఒక్క క్షణం ఏమి జరుగుతోందో అర్ధంకాలేదు, కాని వెంటనే అప్రమతమైన పోలీసులు అతనికి అదుపులోకి తీసుకున్నారు.

Telugu Bronxalleged, York, Nypd-

ఈ ఘటనలో న్యూయార్క్ నగర పోలీసు విభాగానికి చెందిన అధికారి తీవ్రంగాగా గాయపడ్డారు.ఆయనను తక్షణ చికిత్స కోసం దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు.ఈ నేపధ్యంలోనే విచారణ చేస్తున్న పోలీసులకు తెలిసిన ఇంకొక విషయం ఏమిటంటే, అతను పోలీస్ స్టేషన్ మీద మాత్రమే కాదు పెట్రోల్లింగ్ లో ఉన్న అధికారిపై కూడా కాల్పులు జరిపినట్లు తేలింది.ఈ క్రమంలోనే ఆ నిందుతుడి పూర్తి వివరాలతో పాటు, అసలు అతను ఈ ఘాతుకానికి ఎందుకు తెగబడ్డాడు, అతని మానసిక పరిస్థితి ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube