ఆస్ట్రేలియా లో దుండగుడి కాల్పులు....నలుగురు మృతి

మొన్న అగ్రరాజ్యం కాల్పుల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

 Gunfire In Australia 4 People Dead-TeluguStop.com

అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే ఆస్ట్రేలియా లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఆస్ట్రేలియా లోని డార్విన్ నగరంలో ఒక దుండగుడు 5 చోట్ల కాల్పులకు తెగబడినట్లు తెలుస్తుంది.

అయితే ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా,ఒక మహిళ గాయపడినట్లు తెలుస్తుంది.ఒక హోటల్ లోకి ప్రవేశించిన దుండగుడు కొన్ని గదుల్లోకి చొరబడి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడు అన్న దానిపై అధికారులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు.

ప్రస్తుతం దుండగుడిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

అయితే అతడు ఎవరి కోసమో గాలిస్తూ ఈ విధంగా కాల్పులు జరిపినట్లు అనిపించింది అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.మరోవిషయం ఏమిటంటే దుండగుడి గతంలో నేర చరిత ఉంది అని, ఇటీవలే జైలు నుంచి విడుదల అయి వచ్చినట్లు సమాచారం.

అయితే ఇప్పుడు ఎందుకు కాల్పులు జరిపాడు,కారణం ఏంటి అన్నదానిపై స్పష్టమైన సమాచారం తెలియాలి.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube