బాలీవుడ్ లోకి వెళ్తున్న సూపర్ హిట్ బయోపిక్

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన సూరైపొట్టు సినిమా తెలుగు, తమిళ బాషలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

 Guneet Monga Plans To Remake Soorarai Pottru In Hindi, Tollywood, Kollywood, Sou-TeluguStop.com

ఓ విధంగా చెప్పాలంటే సూర్య కెరియర్ లో ఒక అద్భుతమైన చిత్రంగా ఈ సినిమా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.సౌత్ లో సూపర్ హిట్ అయ్యే సినిమాల మీద బాలీవుడ్ నిర్మాతల ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది.

ఇప్పటికే చాలా సౌత్ సినిమాలు బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ రాబట్టాయి.తాజాగా అర్జున్ రెడ్డి సినిమా కూడా బాలీవుడ్ లో రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం నాని జెర్సీ సినిమా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతుంది.అలాగే సినిమా సినిమాలు రీమేక్ కి సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య ఆకాశం నీ హద్దురా సినిమా కూడా బాలీవుడ్ లో రీమేక్ కాబోతుందని తెలుస్తుంది.గతంలో గురు సినిమాని ముందుగా మాధవన్ హీరోగా హిందీ, తమిళ్ బాషలలో సుధా కొంగర తెరకెక్కించారు.

హిందీలో కూడా ఆ సినిమా మంచి హిట్ సొంతం చేసుకుంది.ఈ నేపధ్యంలో సుధా దర్శకత్వంలోనే సూరైపొట్టు సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుంది.

ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం షాహిద్ కపూర్ ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube