మహానటికి బాబు వరం.. గుణశేఖర్‌ ఫైర్‌       2018-05-27   23:02:31  IST  Raghu V

సావిత్రమ్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంకు ప్రేక్షకులు నిరాజనాలు పలుకుతున్నారు. ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు మరియు అన్ని వర్గాల వారు కూడా మహానటి నామం జపిస్తున్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అద్బుతంగా సావిత్రమ్మ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాడు. ఒక పక్కా కమర్షియల్‌ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటు, సావిత్రి జీవితాన్ని అద్బుతంగా నాగ్‌ అశ్విన్‌ చూపించాడు అంటూ అంతా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు ‘మహానటి’ టీంను సన్మానించారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు కీర్తి సురేష్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, అశ్వినీదత్‌ మరియు ఆయన కూతుర్లు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలోనే ‘మహానటి’ చిత్రంతో సావిత్రి జీవితాన్ని అద్బుతంగా ఆవిష్కరించిన చిత్ర యూనిట్‌ సభ్యులకు అభినందనలు తెలియజేయడంతో పాటు ఇంతటి అద్బుతమైన సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి కూడా ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ పన్ను మినహాయింపు వల్ల మహానటి నిర్మాతలకు కోట్లలో లాభం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక గతంలో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రమదేవి’ చిత్రంకు పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వంను చిత్ర యూనిట్‌ సభ్యులు కోరడం జరిగింది. గుణశేఖర్‌ పలు సందర్బాల్లో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్‌ చేశాడు. కాని చంద్రబాబు నాయుడు మాత్రం పట్టించుకోలేదు. కాని బామ్మర్ది చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి పన్ను మినహాయింపు ఇవ్వడంతో గుణశేఖర్‌ అప్పుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. తాజాగా ‘మహానటి’కి పన్ను మినహాయింపు ఇవ్వడంతో మళ్లీ రియాక్ట్‌ అయ్యాడు.

సోషల్‌ మీడియాలో ఏపీ సీఎం నిర్ణయంకు నమస్కారం అంటూ ఏమోజీ విడుదల చేసి తన నిరుసన వ్యక్తం చేశాడు. మహానటి చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాకు వచ్చిన లాభాల్లో 50 లక్షల రూపాయలను ప్రభుత్వ సహాయ నిధికి ఇవ్వాలని భావించారు. ఇలాంటి సమయంలో సీఎం బాబు మహానటికి అదిరిపోయే వరం ఇచ్చాడు. సీఎం చంద్రబాబుకు అశ్వినీదత్‌ కాస్త సన్నిహితంగా వ్యవహరిస్తాడు, ఆయన తెలుగు దేశం పార్టీకి దగ్గర వ్యక్తి. ఆ కారణంగానే పన్ను మినహాయింపు దక్కిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ విషయమై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.