శకుంతలగా స్టార్ బ్యూటీ కావాలంటోన్న డైరెక్టర్

టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఇటీవల తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ‘శాకుంతలం’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశాడు ఈ డైరెక్టర్.

 Gunasekhar Wants Samantha As Shakunthalam Actress, Gunasekhar, Shakuntalam, Sama-TeluguStop.com

కాగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు గుణశేఖర్ రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో లీడ్ రోల్‌లో చేయబోయే హీరోయిన్ ఎవరా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

అయితే ఈ సినిమాలో శకుంతల పాత్ర ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని గుణశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో ఆ పాత్ర పోషించేందుకు పలుపేర్లను ఆయన పరిశీలిస్తున్నాడు.ఈ క్రమంలో స్టార్ బ్యూటీ సమంత అయితే శకుంతల పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని గుణశేఖర్ భావిస్తున్నాడు.

అందంతో పాటు అభినయానికి ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో, ఈ పాత్రను సమంత అయితే బాగా చేయగలుగుతుందని గుణశేఖర్ అంటున్నాడు.అటు టాలీవుడ్ స్వీటీ అనుష్క, అందాల భామ పూజా హెగ్డేల పేర్లు శకుంతల పాత్ర కోసం వినిపిస్తున్నాయి.

కానీ గుణశేఖర్ మాత్రం సమంత పేరునే ఓకే చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరి శకుంతల పాత్ర కోసం సమంతను ఆయన ఏ విధంగా ఒప్పిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మాన్’అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇందులో సమంత ఓ టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి శాకుంతలంలో పాత్రను చేసేందుకు సమంత ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.ఒకవేళ సమంత ఈ పాత్రకు నో చెబితే గుణశేఖర్ నెక్ట్స్ ఆప్షన్ ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనా శాకుంతలం చిత్రం షూటింగ్ మొదలుపెట్టకముందే క్రేజ్‌ను దక్కించుకోవడంలో దూసుకుపోతుందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube