గుణశేఖర్ కి కరోనా పాజిటివ్... శాకుంతలం షూటింగ్ వాయిదా

ప్రస్తుతం టాలీవుడ్ లో సెలబ్రిటీలని కరోనా వెంటాడుతుంది.మొన్నటి వరకు బాలీవుడ్ సెలబ్రిటీల మీద ప్రభావం చూపించిన కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలని కూడా తాకింది.

 Gunasekhar Have Corona Positive Shaakuntalam Shooting Postponed-TeluguStop.com

టాలీవుడ్ లో చాలా మంది ఇప్పటికి సినిమా షూటింగ్ లు కొనసాగిస్తున్నారు.అదే సమయంలో వకీల్ సాబ్ సినిమా కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా ప్రమోషన్ సమయంలో నివేథా థామస్ కి కరోనా సోకింది.ఆమె క్వారంటైన్ లోకి వెళ్ళింది.

 Gunasekhar Have Corona Positive Shaakuntalam Shooting Postponed-గుణశేఖర్ కి కరోనా పాజిటివ్… శాకుంతలం షూటింగ్ వాయిదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తరువాత తిరుపతి ఎన్నికల ప్రచార సభకి వెళ్లి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ టీమ్ కరోనా బారిన పడ్డారు.దీంతో పవన్ కూడా క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.

ఇక సినిమా రిలీజ్ తర్వాత ఫుల్ సక్సెస్ మూడ్ లో ఉన్న దిల్ రాజు అండ్ టీమ్ సక్సెస్ మీట్ లు పెడుతున్నారు.అలాగే మీడియా ముందుకి వచ్చి వకీల్ సాబ్ సక్సెస్ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో దిల్ రాజు తాజాగా కరోనా బారిన పడ్డారు.

అయితే దిల్ రాజు కారణంగా ఇప్పుడు గుణశేఖర్ కూడా కరోనా బారిన పడి శాకుంతలం షూటింగ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

పవన్ కళ్యాణ్ ని కలిసి వచ్చిన తర్వాత దిల్ రాజు గుణశేఖర్ మూవీ శాకుంతలం షూటింగ్ జరుగుతున్న చోటకి వచ్చారు.ఆ సినిమా నిర్మాణంలో దిల్ రాజు భాగస్వామిగా ఉండటంతో గుణశేఖర్ ని కలిసారు.

అనంతరం విఎన్ ఆదిత్యాని కూడా కలిసినట్లు తెలుస్తుంది.వారిని కలిసిన తర్వాత దిల్ రాజుకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బయటపడింది.

దీంతో గుణశేఖర్ ఉన్నపళంగా శాకుంతలం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి కరోనా టెస్టులు చేయించుకున్నారు.ఆయనకి కూడా కరోనా వచ్చినట్లు నిర్ధారణ కావడంతో వెంటనే షూటింగ్ వాయిదా వేసి హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.

విఎన్ ఆదిత్యాకి కూడా కరోనా సోకినట్లు తెలుస్తుంది.మొత్తానికి దిల్ రాజు కారణంగా ఇప్పుడు గుణశేఖర్ కరోనా బారిన పడి శాకుంతలం షూటింగ్ ఆపుకోవాల్సి వచ్చింది.

#Niveda Thomas #Dil Raju #GunasekarHome #Corona Effect #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు