హిరణ్యకశ్యప సినిమాపై క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్

టాలీవుడ్లో బాహుబలి తర్వాత ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి.అలాగే మైథాలజీ కథలకి దర్శకులు దృశ్యరూపం ఇస్తున్నారు.

 Gunasekhar Gives Clarity On Hiranyakashyap Movie, Tollywood, Telugu Cinema, Sout-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని భారీ బడ్జెట్ అయిన కూడా పీరియాడికల్, మైథాలజీ కథలని తెరపై ఆవిష్కరించి తమ సామర్ధ్యం చూపించుకోవాలని అనుకుంటున్నారు.అలాగే ఇలాంటి కథలకి దేశ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది కాబట్టి అన్ని బాషలలో ఏకకాలంలో సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

రామాయణం, మహాభారతం కథలని తెరపైకి తీసుకొచ్చి వాటికి దృశ్య రూపం ఇస్తున్నారు.అలాగే రాజుల కథలకి కూడా ప్రాణం పోస్తున్నారు.

లాంగ్వేజ్ బారియర్స్ చిరిగిపోవడంతో ఇలాంటి సినిమాల కోసం అన్ని భాషల నుంచి నటుల్ని తీసుకుంటున్నారు.ఇప్పుడు ఇదే కోవలోకి దగ్గుబాటి రానా టైటిల్ రోల్ లో తెరకెక్కబోయే హిరణ్యకశ్యప సినిమా కూడా రాబోతుంది.

సుమారు 150 కోట్ల బడ్జెట్ తో సురేష్ బాబు ఈ సినిమాని గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించడానికి రెడీ అయ్యారు.ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయింది.

ఇక సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనుకునే సమయంలో కరోనా లాక్ డౌన్ కారణంగా వెనక్కి వెళ్ళిపోయింది.ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా కూడా కరోనా ప్రభావం అయితే ఉంది.

ఈ నేపధ్యంలో ఇలాంటి సినిమాని తెరకెక్కించాలంటే వందల మంది టెక్నీషియన్స్ పని చేయాల్సి ఉంటుంది.ఇదంతా ఇప్పుడు పెద్ద భారంతో కూడుకున్నది.టీంలో ఎవరికైనా కరోనా వస్తే ఆ ఎఫెక్ట్ షూటింగ్ మీద పడుతుంది.షూటింగ్ ఆగితే లక్షల నుంచి కోట్ల రూపాయలలో నష్టం ఉంటుంది.

ఈ సిచువేషన్ ని దృష్టిలో ఉంచుకొనే ప్రస్తుతం హిరణ్యకశ్యప సినిమా షూటింగ్ ని వాయిదా వేసినట్లు దర్శకుడు గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు.అది తన డ్రీం ప్రాజెక్ట్ అని, ప్రస్తుత పరిస్థితిలో అలాంటి భారీ సినిమా తెరకెక్కించడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో హోల్డ్ లో పెట్టడం జరిగిందని, శాకుంతలం సినిమాకి టెక్నీషియన్స్ నుంచి నటుల వరకు ఎక్కువ మంది పని చేయాల్సిన అవసరం లేదని, అందుకే దీనిని స్టార్ట్ చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube