గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం... పాన్ ఇండియా సినిమానే

టాలీవుడ్ లో దర్శకుడు గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కమర్షియల్ సినిమాకి కళాత్మక హంగులు తీసుకొచ్చే ఈ దర్శకుడు తీసిన సినిమాలన్నింటిలో ఒక ప్రత్యేకత ఉంటుంది.

 Gunasekhar Announced New Movie Named Shakuntalam, Tollywood, Telugu Cinema, Shak-TeluguStop.com

అవి సెట్స్.సినిమాలో కచ్చితంగా మంచి సెట్ నిర్మాణం చేసి దాని చుట్టూ కథని నడిపిస్తూ ఉంటాడు.

గుణశేఖర్ చివరిగా రుద్రమ్మదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఆ సినిమా మంచి హిట్ అయ్యింది.

అయితే రుద్రమ్మదేవి నుంచి గుణశేఖర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లడం మానేశాడు.తన డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశిప మీద వర్క్ చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది.సుమారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సురేష్ బాబు నిర్మించడానికి ముందుకొచ్చారు.

రానా కూడా ఈ సినిమా మీద ప్రత్యేకంగా దృష్టి సారించాడు.

అయితే ప్రస్తుతానికి ఆ హిరణ్యకశ్యపను గుణశేఖర్ పక్కనపెట్టి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

అది కూడా మైథలాజికల్ కథతోనే కావడం విశేషం.హిందూ మైథాలజీలో ప్రేమకథలకి సింబాలిక్ గా శకుంతల, దుశ్యంతుడి కథ మనకి కనిపిస్తుంది.

ఈ పేర్లు ఎక్కువ మంది విన్న కూడా ఆ ప్రేమకథలో మాధుర్యాన్ని ఎవరూ కూడా పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోయారు.ఇప్పుడు శాకుంతలం పేరిట ఆయన మైథాలజీ ప్రేమకావ్యాన్ని రూపొందించడానికి రంగంలోకి దిగారు.

దీనికి సంబంధించిన టైటిల్ ని, మోషన్ పోస్టర్ని ఈ రోజు ఆయన విడుదల చేశారు.భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ అని ఈ సందర్భంగా గుణశేఖర్ క్లారిటీ ఇచ్చాడు.

బ్లాక్ అండ్ వైట్ లో శకుంతల పోట్రైట్ తో ఈ మోషన్ పోస్టర్ రమణీయంగా ఆవిష్కరించాడు.దీనికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమానే గుణశేఖర్ సొంత ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నారు.మరి భారీ బడ్జెట్ తో ప్రేమకావ్యంగా ఆవిష్కరించబోతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్స్ పోషించేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube