శాకుంతలం ప్రేమ కథ గొప్పతనం చెప్పిన గుణశేఖర్  

Gunasekhar About Shaakuntalam, Tollywood, Telugu Cinema, Pan India Movie, Mahabharatham - Telugu Gunasekhar, Gunasekhar About Shaakuntalam, Mahabharatham, Pan India Movie, Shaakuntalam, Telugu Cinema, Tollywood

మహాభారతంలో మొదటి పర్వంలో కనిపించే శకుంతల దుష్యంతుడు ప్రేమ కథ చాలా మందికి తెలిసి ఉంటుంది.ప్రేమ కథలు అనేసరికి అందరికి పార్వతి దేవదాసు, సలీం, అనార్కలి, లైలా మజ్నూ మాత్రమే కనిపిస్తారు.

TeluguStop.com - Gunasekhar About Shaakuntalam

అయితే వీరికి మించిన దృశ్య ప్రేమ కావ్యం శకుంతల దుష్యంతుడు కథలో ఉంటుంది.గతంలో వీరి ప్రేమ కథపై సినిమాలు వచ్చిన అద్బుతమైన ప్రేమ కావ్యంగా దీనిని తెరపై ఎవరూ కూడా ఆవిష్కరించలేకపోయారు.

దీంతో చాలా మందికి ఈ ప్రేమ కథ గురించి తెలియలేదు.అయితే దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా రేంజ్ లో ఈ ప్రేమ కావ్యాన్ని తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - శాకుంతలం ప్రేమ కథ గొప్పతనం చెప్పిన గుణశేఖర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో లీడ్ రోల్స్ చేసేది ఎవరనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయిన ఈ సినిమాని తాను ఎలా ఆవిష్కరించబోతున్నా అనే విషయం మాత్రం అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా అప్డేట్ ఇస్తున్నారు.

తాజాగా ఈ శాకుంతలం కథ గొప్పతనం గురించి గుణశేఖర్ ఒక ట్వీట్ చేశారు.

కాళిదాసు రచనలో వచ్చిన శకుంతల, దుష్యంతుల ప్రేమకథ వెస్ట్రన్‌ భాషలలో అనువాదం అయిన భారతీయ నాటకాలలో మొట్టమొదటిది.ఈ ప్రేమకథను 1789లో విలియమ్‌ జోన్స్‌ అనువదించగా.ఆ తర్వాత వంద సంవత్సరాలకి.అంటే 1889లో ఈ నాటకం 46 భాషలలోకి అనువాదం అయింది.

నార్వేజియన్‌, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి మొదలగు భాషలు ఇందులో ఉండటం విశేషం అని గుణశేఖర్‌ తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు.మొత్తానికి ఈ కథ గొప్పతనం గురించి చెప్పడం ద్వారా తాను శాకుంతలంపై ఇంత ఆసక్తి చూపించడానికి గల కారణాలు, ఎలా ఆవిష్కరించబోతున్నా అనే విషయాలపై అందరికి ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

#Mahabharatham #Gunasekhar #GunasekharAbout #Pan India Movie #Shaakuntalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gunasekhar About Shaakuntalam Related Telugu News,Photos/Pics,Images..