5 ఏళ్లు హడావుడి చేసి ఇప్పుడు చేతులు ఎత్తేయడం ఏంటీ గురూ?

గుణ శేఖర్‌ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్‌గా వచ్చిన ‘రుద్రమదేవి’ విడుదలై దాదాపుగా అయిదు సంవత్సరాలు అవుతుంది.అప్పటి నుండి కూడా దర్శకుడు గుణశేఖర్‌ తన తదుపరి చిత్రాన్ని రానాతో చేయబోతున్నట్లుగా చెబుతూ వచ్చాడు.

 Gunasekaran Wants Tostop Hiranya Kasipa Movie With Rana-TeluguStop.com

పదే పదే ఆ విషయాన్ని చెబుతున్నాడు.కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి ఒక్క స్టెప్పును కూడా వేసినట్లుగా లేదు.

రానా కూడా హిరణ్య కశిప ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

 Gunasekaran Wants Tostop Hiranya Kasipa Movie With Rana-5 ఏళ్లు హడావుడి చేసి ఇప్పుడు చేతులు ఎత్తేయడం ఏంటీ గురూ-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్నాళ్ల క్రితం దర్శకుడు గుణశేఖర్‌తో కలిసి సురేష్‌బాబు దాదాపుగా 150 కోట్లతో హిరణ్య కశిప చిత్రాన్ని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

కాని తాజా సమాచారం ప్రకారం సినిమా అటకెక్కినట్లుగా ఉంది.రానా అనారోగ్య కారణాలు మరియు భారీ బడ్జెట్‌ సినిమాలకు వస్తున్న ఆధరణ మరియు నష్టాలను బేరీజు వేసిన నిర్మాత సురేష్‌బాబు ఆ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేస్తే బెటర్‌ అంటూ దర్శకుడు గుణశేఖర్‌కు సూచించాడట.

మొదట గుణశేఖర్‌ ఎలాగైనా సినిమాను చేయాలనుకున్నా ఇప్పుడు మెల్లగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.హిరణ్య కశిప సినిమాకు రానా తప్ప మరెవ్వరు కూడా ఓకే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు.అదే సమయంలో ఆయన అనారోగ్యం మరియు బడ్జెట్‌ వంటి పరిస్థితుల కారణంగా ఆ సినిమాను పక్కకు పెట్టాలని గుణశేఖర్‌ నిర్ణయించుకున్నాడు.రుద్రమదేవి చిత్రం తర్వాత ఏదైనా చిన్న సినిమా చేసినా కూడా గుణశేఖర్‌ కు మంచి సక్సెస్‌లు పడేవి.

కాని ఆయన మాత్రం భారీ సినిమానే అంటూ అయిదు సంవత్సరాలు వృదా చేసి ఇప్పుడు పక్కకు పెట్టాడు.

#Rana #Gunasekaran #Gunasekaran #Hiranya Kasipa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు