ఆ వార్తలన్నింటిని పుకార్లు అనేసిన గుణశేఖర్‌

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రుద్రమ దేవి సినిమా తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా ను ప్రారంభించింది.లేదు ఐదు సంవత్సరాలు పూర్తి అయినా కూడా గుణశేఖర్ కొత్త సినిమా ప్రారంభించక పోవడంపై ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Director Gunasekhar Condemns Web Series Rumors, Web Series, Ott Netflix, Gunasek-TeluguStop.com

మొదట ప్రతాప రుద్రుడు సినిమాను రూపొందించబోతున్నట్లుగా ప్రకటించిన గుణశేఖర్ ఆ తర్వాత హిరణ్య కశ్యపుడు సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గా పేర్కొన్నాడు.రానాతో చర్చలు కూడా జరుగుతున్నాయని ఒకానొక సమయంలో ప్రకటించాడు.

కానీ ఆ సినిమా ఎప్పటికీ ప్రారంభమవుతుందో ఇప్పటికి క్లారిటీ లేదు.హిరణ్యకశ్యప సినిమా కు ముందు ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించేందుకు గుణశేఖర్ సిద్ధమయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి.

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వారు ఆ వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం కూడా జరిగింది.
ఇటీవల కథా చర్చలు జరిగిన తర్వాత వారు గుణశేఖర్ కథను తిరస్కరించారని దాంతో దర్శకుడు గుణశేఖర్ లేకుండా ఒంటరిగా మిగిలి పోయాడు అంటూ సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

గుణశేఖర్ స్క్రిప్ట్ ను వారు తిరస్కరించినట్లుగా జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు గుణశేఖర్ ఎట్టకేలకు స్పందించాడు.మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని వాటికి ఎలాంటి ఆధారాలు లేవని వాటిని నమ్మి కొందరు మీడియాలో ప్రచారం చేయడం అవివేకమని గుణశేఖర్ అసహనం వ్యక్తం చేశాడు.

తాను ఏ వెబ్ సిరీస్ కి కూడా ప్లాన్ చేయలేదని ఎవరితోనూ నేను కాంటాక్ట్ అవ్వలేదని నాకు వెబ్ సిరీస్ పై ఆసక్తి లేదంటూ గుణశేఖర్ పేర్కొన్నాడు.నిప్పు లేనిదే పొగ రాదంటారు.

మరి ఇన్ని రోజులు గుణశేఖర్ వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నాడు అని అన్నప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు.నెట్ ఫ్లిక్స్ వారు వద్దన్న తర్వాత ఇప్పుడు తనకు వ్యతిరేకులపై ఆసక్తి లేదంటూ గుణశేఖర్ చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube