అమెరికాలోని వర్జీనియా లోని ఓ బీచ్ నగరంలో మరో సారి కాల్పులు జరిగాయి.బీచ్ నగరంలోని మున్సిపల్ కేంద్రం వద్ద ఓ గన్ మెన్ కాల్పులకి తెగబడ్డాడు.
విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ క్రమంలోనే దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డారు.
కాల్పులు జరిపిన వ్యక్తి ఓ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించారు పోలీసులు.
అతడు మున్సిపల్ సెంటర్ కి చెందిన రెండు విభాగాలలో కాల్పులు జరిపాడని వర్జీనియా పోలీసు అధికారి తెలిపారు.ఈ కాల్పులలో గాయపడిన వారిని వర్జీనియా బీచ్ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.అయితే ఈ కాల్పులు జరగడం దురదృష్ట కరమని మేయర్ బాబీ డియర్ విచారం వ్యక్తం చేశారు.
కాల్పులు ఘటన జరుగుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వచ్చి నిందితుడిని హతమార్చారు.మున్సిపల్ కేంద్రంలో పనిచేసిన నిందితుడు అదే కార్యాలయంలో కాల్పులు ఎందుకు జరిపాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పని ఒత్తిడి కారణంగా జరిగిందా లేదా మానసిక పరిస్థితి సరిగా లేదా అనే కోణంలో విచారణ చేపట్టారు.