కంగ‌నా ఇంటి వ‌ద్ద కాల్పులు కలకలం..!  

gunshots near the manali house of actress kangana ranaut gunshots, manali house, actress kangana ranaut - Telugu Actress Kangana Ranaut, Gunshots, Manali House

బాలీవుడ్ నటి కంగన రనౌత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఎప్పటికప్పుడు బాలీవుడ్ లో నేపోటిజంపై మాట్లాడే ఆమె ఇంటి వద్ద తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.

 Gun Shots Near The Manali House Of Actress Kangana Ranaut

పూర్తి వివరాల్లోకి వెళ్తే.మనాలీలోని సొంత భవంతిలో నివసిస్తున్న కంగనా రనౌత్‌కు భవంతి సమీపంలో శుక్రవారం రాత్రి 11:30 సమయంలో ఉన్నట్లుండి తుపాకీతో కాల్పులు చప్పుళ్లు వినిపించాయి.

దీంతో ఆ చెప్పుళ్ళకు బెదిరిపోయిన ఆమె వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

కంగ‌నా ఇంటి వ‌ద్ద కాల్పులు కలకలం..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయంపై మాట్లాడిన కంగనా రనౌత్ మొదట తుపాకీ చెప్పులు అని అనుకోలేదని, రెండొవసారి విన్నప్పుడు అర్థం అయ్యింది అని ఆమె చెప్పారు.

అలా తుపాకి చప్పుళ్లు వినిపించి ఎవరో తనను బెదిరించడానికి ప్రయత్నిచినట్టు కంగనా ఆరోపించారు.

డబ్బు కోసమే ఇలా చేసి ఉంటారని ఆమె చెప్పారు.అంతేకాదు.

ఈ దేశంలో విచ్చలవిడిగా గూండాగిరి చేస్తున్నారని, సూశాంత్ సింగ్ రాజ్ పుత్ ని కూడా ఇలానే భయపడి ఉంటాడు అని ఆమె అన్నారు.కాగా ఈ ఘటన ఇలా ఉండగా విచారణ జరిపి త్వరలోనే నిందితులను పట్టుకుంటాం అని స్థానిక పోలీసులు తెలిపారు.

కాగా ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Manali House #Gunshots

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gun Shots Near The Manali House Of Actress Kangana Ranaut Related Telugu News,Photos/Pics,Images..