అమెరికాలో గన్ ఫైర్..3 మృతి.     2019-01-06   15:20:18  IST  Surya Krishna

అమెరికాలో మరో సారి కాల్పులు జరిగాయి. అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికా ఇటువంటి గన్ కల్చర్ ని అరికట్టడంలో మాత్రం ఘోరంగా విఫలం అవుతోందని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. గడిచిన రెండు నెలల కాలంలో అమెరికాలో దాదాపు ఇలాంటి సంఘటన జరగడం ఇది 5వ సారి అంటున్నాయి అమెరికా మీడియా వర్గాలు.

Gun Fire At Global House In America-NRI Telugu NRI News Updates

Gun Fire At Global House In America

ఈ దుర్ఘటన లాస్ ఏంజెల్స్‌కు సమీపంలోని ఓ గేమింగ్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో బాధితులందరూ పురుషులేనని శుక్రవారం రాత్రి 11.50 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

Gun Fire At Global House In America-NRI Telugu NRI News Updates

అయితే గేమింగ్ కాంప్లెక్స్‌లో ఓ గొడవ జరిగిందని.. ఈ ఘర్షణ కారణంగానే కాల్పులు జరిగాయని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కేసు విషయంపై విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారులు తెలిపారని అమెరికా మీడియా తెలిపింది.