టాయిలెట్‌కు వెళ్తుండ‌గా జేబులోనే పేలిన గ‌న్‌.. ఏమైందంటే..?

కొన్ని సార్లు అంతే ఏదో అనుకుంటే ఇంకేదో జ‌రిగిపోతుంది.మ‌నం చేసే చిన్న చిన్న పొర‌పాట్లే మ‌న ప్రాణాల మీద‌కు తెస్తుంటాయి.

 Gun Exploded In The Pocket While Going To The Toilet, Gun, Viral News, 39 Years-TeluguStop.com

చాలా సార్లు గ‌న్‌లు ఎంత ఆత్మ ర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డుతాయో వాటితో అంతే ప్రమాదం కూడా ఉంటుంది.వాటిని స‌రిగ్గా వాడ‌క‌పోతే మ‌న ప్రాణాల మీద‌కే వ‌స్తుంది.

ఎక్కువ‌గా పోలీసులు వీటిని జేబుల్లో లేదా చేతిలో పెట్టుకున్న‌ప్పుడు నిర్ల‌క్ష్యంగా ఉంటే మాత్రం అవి జేబులోనే పేలిన ఘ‌ట‌న‌లు మ‌నం చాలానే తెలుసుకుంటున్నాం.ఇక‌పోతే ఇప్పుడు కూడా ఇలాగే జ‌రిగింది ఓ యువ‌కుడి విష‌యంలో.

ఓ యువ‌కుడు టాయిలెట్ కు వెళ్తున్న స‌మ‌యంలో అనుకోకుండా అత‌ని ప్యాంట్ జేబులో గ‌న్ పేలి పెద్ద గాయ‌మే అయింది.అయితే ఈ ప్ర‌మాదం గురించి తెలుసుకున్న ఆఫీస‌ర్లు వెంట‌నే అత‌న్ని ఆస్ప‌త్రికి తీసుకెల్లారు.

ఈ ఘ‌ట‌న న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్‌లో జ‌రిగింద‌ని తెలుస్తోంది.ఈ టైమ్స్ స్వ్కేర్ ఏరియాలో 39 ఏళ్ల వ్యక్తి నివ‌సిస్తున్న‌ట్టు స‌మ‌చారం.

అయితే యూఎస్‌లో గ‌న్‌లు వెంట పెట్టుకోవ‌డం చాలా స‌ర్వ సాధార‌ణం అనే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే.ఈ వ్య‌క్తి కూడా ఇలాగే ఆ గ‌న్‌ను త‌న పాకెట్‌లో పెట్టుకున్నాడు.

Telugu Gun Pocket, Injury Leg, York, Times Square-Latest News - Telugu

అయితే ఓ రోజు మ‌ధ్యాహ్నం అత‌ను టాయిలెట్‌కి వెళ్తుండ‌గా అలాగే పాకెట్‌లో పెట్టుకున్నాడు.అప్ప‌టికే ఆ గ‌న్ ఫుల్ లోడ్ చేసి ఉండ‌టంతో పొరపాటును ఆయ‌న గన్ ట్రిగర్ పై వేలు పెట్టాడు.ఇంకేముంది ఆ గ‌న్ కాస్త ఫైర్ అయిపోయింది.గ‌న్ లోని బుల్లెట్ డైరెక్టుగా కాలికి తగల‌డంతో గాయం అయిపోయింది.తుపాకీ పేలుడుకి పెద్ద సౌండ్ రావ‌డంతో ప‌క్క‌నే ఉన్న వ్య‌క్తి వెంట‌నే పారిపోయాడు.ఈ విష‌యం తెలుసుకున్న వారు కాస్తా ఆయ‌న్ను ఆస్ప‌త్రిలో చేర్పించారు.

ఇక పోలీసులు వ‌చ్చి దీనిపై విచార‌ణ చేప‌డుతున్నారు.గ‌న్‌ను జాగ్ర‌త్త‌గా వాడుకోవాల‌ని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube