ఆ ఊరంత కంపు కంపు.. పేడతో కొట్టుకుంటున్న గ్రామస్తులు.. ఎందుకంటే..?

చాలా చోట్ల కొన్ని వింత వింత ఆచారాలు అప్పుడప్పుడు వెలుగులోకి రావడంతో మనం ఆశ్చర్యపోతూ ఉంటాం.తాజాగా ఇలాంటి ఆచారం ఒకటి బయటికి వచ్చింది.

 Gummatapura Villagers Celebrates Gore Habba Festival, Gore Habba Festival, Gum-TeluguStop.com

ఓ ఊరిలో జనాలంతా ఓ చోటుకి చేరుకునే ముందు పశువుల పాకలో ఉన్న పేడ మొత్తం అక్కడికి వెళ్ళే ముందే తీసుకువెళ్తారు.అలా తీసుకువెళ్లిన పేడను ఊరి వీధులలో పోస్తారు.

ఇక అంతే అసలైన రచ్చ మొదలైతుంది.ఆ గ్రామస్తులంతా ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటునట్లు ఉంటుంది అక్కడి వాతావరణం.

ఒకరిపై ఒకరు ముఖాల మీద పేడను పిడకలు అయ్యేలా కొట్టుకుంటారు.దాంతో వారి ఒళ్ళంతా పేడ వాసనతో కంపుకొట్టేలా అవుతుంది.

ముక్కలకు భరించలేనంత వాసన వస్తున్నా అసలెవ్వరు తగ్గకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు.అయితే ఇదంతా కోపంగా కాదండోయ్.

కేవలం అక్కడ కొన్ని సంవత్సరాలుగా వారు పాటిస్తున్న ఆనవాయితీ మాత్రమే.అది కూడా కేవలం దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇలా వారు పేడతో కొట్టుకుంటారు.


ఇకపోతే ఇది ఎక్కడో కాదండోయ్.మన భారతదేశంలో కర్ణాటక – తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గుమ్మటపురాలో ఈ పేడ ఉత్సవం జరుగుతుంది.ఈ కార్యక్రమం నిర్వహించుకునే సమయానికి ఒక నెల ముందు నుంచి వారి ఊర్లలో పేడ నిల్వ చేసుకుని ఆ తర్వాత వాటిని ఈ విధంగా ఉపయోగిస్తారు.ఈ కార్యక్రమం ముగిసేసరికి ఊర్లోని పేడ అసలు పూర్తిగా కనుమరుగవుతోంది.

కేవలం ఆ ఊర్లో మాత్రమే కాదు చుట్టుపక్కల ఊర్లో నుంచి కూడా పేడను ట్రాక్టర్లతో తీసుకువచ్చి అక్కడ ఉత్సవానికి ఉపయోగిస్తారు.ఉత్సవానికి గోరే హబ్బ అని పేరు పెట్టి వేడుకను జరుపుకుంటారు.

పేడను పెద్దపెద్ద ముద్దలుగా చుట్టుకొని ఎదుటివారి పై కొట్టడమే ఈ పండుగలో ఆనవాయితీ.

ఇకపోతే ఈ ఊరి ప్రజలు దేవుడిగా కొలిచే వీరేశ్వరస్వామి ఆవు పేడలో జన్మించారని ఆ గ్రామస్తుల నమ్మకం.అందుకే అక్కడ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు అందరూ పేడను కుప్పలు కుప్పలుగా పోగుచేసి ఒకరిపై ఒకరు కొట్టుకుంటారు.ఇలా చేసుకోవడం ద్వారా వారికి అనారోగ్యాలు దరిచేరవు అని అంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకం.

అయితే ఈ వేడుకలో మాత్రం స్త్రీలు పాల్గొనరు.కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారు అది కూడా ఒంటి మీద చొక్కాలు లేకుండా పేడతో కొట్టుకుంటారు.

ఎవరి ఆచారం వారిది కాబట్టి ఈ వేడుకను కూడా మనం గౌరవించి వారికి మంచి చేకూరాలని కోరుతున్నాం.ఈ వేడుక ఎలా జరుగుతుందో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube